గుణ శేఖర్‌ని లైట్ తీసుకున్న రానా.!

- July 29, 2023 , by Maagulf
గుణ శేఖర్‌ని లైట్ తీసుకున్న రానా.!

రానా - గుణ శేఖర్ కాంబినేషన్‌లో ‘హిరణ్య కశ్యప’ మూవీ ఎప్పుడో అనౌన్స్ అయిన సంగతి తెలిసిందే. అయితే, ఇంతవరకూ ఈ సినిమాకి సంబంధించి ఎలాంటి అప్‌డేట్ లేదు. 

రానా తన సినిమాలతో, గుణ శేఖర్ ఇతరత్రా ప్రాజెక్టుల్లో బిజీ అయిపోయి, ఈ ప్రాజెక్ట్ దాదాపు పక్కన పెట్టేశారు. అయితే, ఇటీవలే ఈ సినిమా గురించి ప్రస్థావన తెర పైకి వచ్చింది.

అయితే, ఈ మధ్య గుణ శేఖర్‌కి ఏదీ కలిసి రావడం లేదు. ఏ సినిమా పట్టుకున్నా మట్టే అయిపోతుంది. స్టార్ స్టేటస్ వున్న సమంత (శాకుంతలం) కూడా గుణ శేఖర్ అదృష్టాన్ని మార్చలేకపోయింది.

దాంతో, రానా షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడట. ఈ ప్రాజెక్ట్‌ బాధ్యతని తన భుజాలపై వేసుకున్నాడనీ తెలుస్తోంది. తన సొంత నిర్మాణంలో ఈ సినిమాని రూపొందించబోతున్నాడట.

అలాగే, గురూజీ త్రివిక్రమ్ సలహాలూ, సూచనలూ ఈ సినిమా కోసం కోరబోతున్నాడనీ తెలుస్తోంది. అమర్ చిత్ర కథ అనే ఓ కామిక్ బుక్ నుంచి ఈ సినిమా కథా నేపథ్యాన్ని తీసుకోబోతున్నారనీ తెలుస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com