మాస్ కా దాస్ నయా అవతార్.!
- July 29, 2023
ఆటిట్యూడ్ హీరో విశ్వక్ సేన్ కొత్త సినిమా వస్తోందంటే చాలు.. ఎక్కడ లేని కాంట్రవర్సీలు పుట్టించి సినిమాని ప్రమోట్ చేసుకుంటూ వుంటాడు. అది ఆయన ప్రత్యేకత.
అయితే, ప్రస్తుతం విశ్వక్ సేన్ చేతిలో చాలానే ప్రాజెక్టులున్నాయనుకోండి. వీటితో పాటూ, ఈ మధ్య సూపర్ సక్సెస్ అయిన కొన్ని క్రేజీ ప్రాజెక్టులు విశ్వక్ సేన్ వదులుకున్నాడన్న ప్రచారం కూడా వుంది.
ఆ సంగతి అటుంచితే, తాజాగా విశ్వక్ సేన్ తన 11 వ సినిమాని అనౌన్స్ చేయబోతున్నాడు. ఈ సినిమా కోసం విశ్వక్ సేన్ తన మునుపటి గెటప్‌లో కనిపించబోతున్నాడు.
ఆయన కెరీర్ మొదట్లో నటించిన ‘ఫలక్‌నుమా దాస్’ సినిమాలో కంప్లీట్ మాస్ అవతార్‌లో కనిపిస్తాడు. ఆ తర్వాత వచ్చిన సినిమాల్లో ఆటిట్యూడ్ చూపించినా చాక్లెట్ బోయ్‌లా యూత్‌కి కనెక్ట్ అయ్యాడు. ఇప్పుడు మళ్లీ రగ్గ్డ్ అండ్ మాస్ అవతారమెత్తబోతున్నాడట విశ్వక్ సేన్.
ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్, టైటిల్ గ్లింప్స్ జూలై 31న ప్రకటించబోతున్నారు. కృష్ణ చైతన్య ఈ సినిమాకి దర్శకుడు. హీరోయిన్ తదితర వివరాలు తెలియాల్సి వుంది.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







