షార్జా ఐలాండ్‌లో సందర్శనకు అనుమతి
- May 16, 2016
ఏడాదికోసారి సందర్శకులకు అవకాశం కల్పించేందుకు షార్జా ఐలాండ్ సిద్ధమయ్యింది. షార్జాలోని సర్ బు నైర్ ఐలాండ్, మే 19, 20 తేదీల్లో సందర్శకులను సంభ్రమాశ్చర్యాలకు గురిచేయనుంది. సర్ బు నైర్ ఫెస్టివల్ సందర్భంగా సందర్శకులకు మంచి అనుభూతి కల్పించనుంది ఈ ఐలాండ్. స్కూబా డైవింగ్, సైట్ సీయింగ్, బోటింగ్, ధో రేసింగ్ మరియు హెరిటేజ్ షోలు ఈ ఫెస్టివల్లో ప్రధాన ఆకర్షణ కానున్నాయి. షార్జాకి నార్త్ వెస్ట్‌లో 90 కిలోమీటర్ల దూరంలో వున్న ఈ ఐలాండ్‌కి చేరుకోవడానికి విజిటర్స్ ప్రత్యేకంగా తమ సొంత ట్రాన్స్‌పోర్ట్‌ని సముద్ర మార్గం గుండా ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. షార్జా ఎన్విరాన్మెంట్ అండ్ ప్రొటెక్టెడ్ ఏరియాస్ అథారిటీ (ఇపిఏఏ) 17వ ఎడిషన్ ఫెస్టివల్‌ని నిర్వహిస్తోంది. 'ది సీ ఈజ్ అవర్ లైఫ్' థీమ్‌తో ఈ వేడుకలు జరుగుతాయి. 4000 మందికి పైగా ఈ ఫెస్టివల్లో పాల్గొంటారని ఓ అంచనా. సముద్ర జీవుల పట్ల సందర్శకుల్లో అవగాహన కల్పించే కార్యక్రమాలను నిర్వహించనున్నారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!







