మోడ్రన్ మీడియా పట్ల ఖతారీల్లో ఆసక్తి
- May 16, 2016
మోడ్రన్ సొసైటీతో తమ సంస్కృతీ సంప్రదాయాలను కొనసాగించాలని 10 మందిలో 8 మంది ఖతారీలు భావిస్తున్నట్లు ఓ సర్వేలో వెల్లడయ్యింది. నార్త్ వెస్ట్రన్ యూనివర్సిటీ ఇన్ ఖతార్ విడుదల చేసిన ఈ సర్వే 'మీడియా యూజ్ ఇన్ మిడిల్ ఈస్ట్ 2016' పేరుతో జరిగింది. మోడ్రన్ మీడియాని ఖతారీలు ఎక్కువగా వినియోగిస్తున్నారనీ, సాధారణ టెలివిజన్ ప్రోగ్రామ్స్‌తో పోల్చితే, ఇతరత్రా మార్గాలపైనే వారు ఎక్కువ దృష్టి పెడ్తున్నారని ఎన్యు-క్యూ జర్నలిజం ప్రోగ్రామ్ అసిస్టెంట్ డైరెక్టర్ జస్టిన్ మార్టిన్ చెప్పారు. ఇంగ్లీష్ లాంగ్వేజ్ బేస్డ్ ప్రింట్ మెటీరియల్, టెలివిజన్ ప్రోగ్రామ్స్ విషయంలో అరేబియా (8 శాతం), ఈజిప్ట్ (3 శాతం)తో పోల్చితే ఖతారీ మరియు యూఏఈ నేషనల్స్ (24 శాతం) ముందంజలో ఉన్నారని ఆ సర్వే వెల్లడించింది. ఖతారీలు తమ దేశానికి సంబంధించిన విషయాల మీద మంచి అవగాహన కలిగి ఉంటారు. ఖతారీలు వార్తలపై ఎక్కువ ఫోకస్ పెడ్తారు. రీజియన్‌లో మిగతావారితో పోల్చితే మూడు రెట్లు ఎక్కువగా ఖతారీలు ఫేస్‌బుక్‌ని వినియోగిస్తున్నారు. ఖతారీలు ట్విట్టర్‌ని పలు విధాలుగా వినియోగిస్తున్నారు. జాతీయ, అంతర్జాతీయ విషయాలపై ట్విట్టర్ ద్వారా తెలుసుకోవడం, తమకు తెలిసిన సమాచారాన్ని ఇతరులతో పంచుకోవడం చేస్తున్నారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!







