భోళా శంకర్’ మేనియా స్టార్ట్స్.!
- August 03, 2023
ఆగస్టు 11న మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘భోళా శంకర్’ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాపై రెండు తెలుగు రాష్ర్టాల్లోనూ భారీగా అంచనాలున్నాయ్.
ఇప్పటికే రిలీజ్ చేసిన ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాల్ని అంతకంతకూ పెంచేస్తున్నాయ్. తాజాగా సెన్సార్ బోర్డ్ ఈ సినిమాకి ‘యు బై ఏ’ సర్టిఫికెట్ ఇచ్చింది. చిరంజీవి రెట్టించిన ఉత్సాహంతో ఈ సినిమాలో కనిపిస్తున్నట్లు ప్రచార చిత్రాలు ప్రూవ్ చేస్తున్నాయ్.
అలాగే ఫ్యాన్స్‌కి అసలు సిసలు మెగా ఫీస్ట్‌గా ‘భోళా శంకర్’ వుండబోతోందనీ అంటున్నారు. చిరంజీవి సూపర్ హిట్ మూవీస్‌లో ఒకటైన ‘శంకర్ దాదా ఎమ్‌బిబిఎస్’ సినిమాతో ఈ సినిమాని పోల్చుతున్నారు.
అంటే, ఈ సినిమాలో ఎంటర్టైన్మెంట్ ఆ రేంజ్లో వుండబోతోందనీ తెలుస్తోంది. హ్యూమన్ ట్రాఫికింగ్ నేపథ్యంలో ‘భోళా శంకర్’ కథ వుండబోతున్న సంగతి తెలిసిందే. తమిళ బ్లాక్ బస్టర్ ‘వేదాళం’కి రీమేక్‌గా రూపొందుతోన్న ఈ సినిమాకి మెహర్ రమేష్ దర్శకత్వం వహించారు. మిల్కీ బ్యూటీ తమన్నా, మహా నటి కీర్తి సురేష్ ఫీమేల్ లీడ్ రోల్స్ పోషించారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







