‘బెదురు లంక’తో ఆ యంగ్ హీరో ఫామ్‌లోకి వస్తాడా.?
- August 03, 2023
‘ఆర్ఎక్స్ 100’ సినిమాతో తనదైన శైలి హీరోగా గుర్తింపు దక్కించుకున్నాడు యంగ్ హీరో కార్తికేయ. నటనలో డిఫరెంట్ టాలెంట్ చూపించిన ఈ యంగ్ హీరో, తమిళంలో ఏకంగా అజిత్‌కి విలన్‌గా నటించి మంచి మార్కులేయించుకున్నాడు కూడా.
అయితే, ఎందుకో తెలీదు కానీ, తెలుగులో ఈ కుర్ర హీరో కెరీర్ అంతంత మాత్రంగానే నడుస్తోంది. చేసిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో పాపం కుర్రోడు బెదిరిపోయాడట. తదుపరి కథల విషయంలో కాస్త డైలమాలో వున్నాడట.
కార్తికేయ తాజా సినిమా ‘భెదురు లంక 2012’ త్వరలో రిలీజ్‌కి సిద్ధంగా వుంది. ఈ సినిమాతో ఎలాగైనా హిట్టు కొట్టాలని చూస్తున్నాడు. రీసెంట్‌గా రిలీజ్ చేసిన ఈ సినిమాలోని సాంగ్ ప్రోమో అందర్నీ ఆకట్టుకుంటోంది.
2012 యుగాంతం నేపథ్యాన్ని కాస్త ఫన్నీ టోన్‌లో చెప్పినట్లు తెలుస్తోంది ఈ సినిమాలో. ఈ మధ్య నరాలు తెగిపోయే థ్రిల్లర్ సినిమాలు ఎక్కువగా రావడంతో, ఫన్ టోన్ సినిమాల కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు జనం.
ఆ క్రమంలోనే ఇటీవల వచ్చిన చిన్న సినిమా ‘సామజవరగమన’కు ప్రేక్షకులు బ్రహ్మరధం పట్టారు. ఆ తరహాలోనే కామెడీ వర్కవుట్ అయితే, ‘బెదురు లంక’తో కార్తికేయ బెదురు కూడా తొలిగిపోయినట్లే.!
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







