కువైట్ లో 117 మంది అక్రమ నివాసితులు అరెస్ట్
- August 04, 2023
కువైట్: అహ్మదీ, హవల్లీ మరియు ఫర్వానియా గవర్నరేట్లలో అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖలోని రెసిడెన్సీ అఫైర్స్ ఇన్వెస్టిగేషన్ జనరల్ డిపార్ట్మెంట్ తన భద్రతా ప్రచారాలను కొనసాగించింది. రెసిడెన్సీ, లేబర్ చట్టాలను ఉల్లంఘించిన వివిధ దేశాలకు చెందిన 117 మంది వ్యక్తులను ఈ సందర్భంగా అరెస్టు చేసింది. అరెస్టయిన వారిలో నలుగురు డెలివరీ కంపెనీ ఉద్యోగులు కూడా ఉన్నారు. ఎంబసీ అధికారి వలె నటించి, గృహ కార్మికులను అక్రమంగా రవాణా చేసిన వ్యక్తిని కూడా అధికారులు అరెస్టు చేశారు. వారికి అతను ఆశ్రయం కల్పించి, వారిని గంట ప్రాతిపదికన పని చేయించాడు. అరెస్టు చేసిన వారందరినీ సంబంధిత అధికారులకు రిఫర్ చేసినట్టు అంతర్గత మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







