యూఏఈలో వడగళ్ళు, భారీ వర్షం..!
- August 04, 2023
యూఏఈ: యూఏఈలోని కొన్ని ప్రాంతాలలో భారీ వర్షం కురిసింది. అదే సమయంలో వడగళ్ళు పడటంతో వాతావరణ అధికారులు ఎల్లో, ఆరేంజ్ హెచ్చరికలను జారీ చేశారు. షార్జాలో ముఖ్యంగా షేక్ ఖలీఫా బిన్ జాయెద్ రోడ్డు మీదుగా అల్ మాడమ్ పై గురువారం సాయంత్రం 4.30 గంటలకు వడగళ్ల వాన కురిసింది. ఎమిరేట్‌లోని అల్ ర్వైదా, అల్ ఫయా మరియు అల్ బహయేస్ ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు పడ్డాయి. భారీ వర్షాల నేపథ్యంలో దుబాయ్ సమీపంలోని షార్జాలోని కొన్ని ప్రాంతాలకు ఎల్లో మరియు ఆరెంజ్ అలర్ట్‌లు జారీ చేశారు. నివాసితులు బయటకు వెళ్లేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అస్థిర వాతావరణం నేపథ్యంలో డ్రైవర్లు రోడ్లపై మరింత జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు. మరోవైపు ప్రతి ఒక్కరూ అధికారిక సమాచార వనరులపై మాత్రమే ఆధారపడాలని, పుకార్లను వ్యాప్తి చేయకుండా ఉండాలని ఎన్సీఎం పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







