'TAMA' ఎడ్యుకేషన్ సెమినార్కు అనూహ్య స్పందన
- August 04, 2023
అమెరికా: 'తామా' (తెలుగు అసోసియేషన్ ఆఫ్ మెట్రో అట్లాంటా) నిర్వహించిన ఎడ్యుకేషన్ సెమినార్కు విశేష స్పందన లభించింది. తామా వారి కార్యక్రమాలలో ఇది మరో కలికితురాయిగా చేరింది. స్థానిక కమ్మింగ్లోని షారన్ కమ్యూనిటీ భవనంలో శనివారం, జూలై 22న నిర్వహించిన ఒక ప్రత్యేక, ఉపయోగకరమైన విద్యా సెమినార్ లో 200 మందికి పైగా విద్యార్థులు మరియు తల్లిదండ్రులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఊహించిన దానికంటే ఎక్కువ మంది హాజరు కావడంతో నిర్వాహకులు నేలపై టార్పాలిన్ పట్టాలు వేసి విద్యార్థులు కూర్చోవాలని కోరారు. చాలా మంది నిలబడి మరీ విన్నారు. విద్య అనేది మన జీవితంలో ఒక ముఖ్యమైన అంశం, విద్యా నిపుణురాలు డాక్టర్ వాణి గడ్డం చేసిన ఈ వివరణాత్మక సెమినార్ ద్వారా హాజరైన వారికి ఎన్నో మంచి విషయాలు తెలియటమే కాకుండా, సరైన మార్గంలో వెళ్ళడానికి కూడా సహాయపడుతుంది. ఇది 2023లో తామా వారి 16వ కార్యక్రమం, క్లుప్త వేసవి విరామం తర్వాత మొదటిది. ముఖ్యమైన విషయాలను విపులీకరిస్తూ, పరస్పర సంభాషణలతో సాగిన ఈ ప్రసంగం ఆద్యంతం అద్భుతంగా జరిగింది.
స్టూడెంట్స్ మరియు పేరెంట్స్ ఎంతో ఆసక్తిగా పాల్గొని, చివరి వరకు ఉండి, అనేక ప్రశ్నలు అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఇంత అద్భుతమైన కార్యక్రమాన్ని నిర్వహించినందుకు విచ్చేసిన వారు తామా ని అభినందించి, ఇలాంటి మరెన్నో చేయాలని విజ్ఞప్తి చేశారు. తామా బహుముఖ మరియు అన్ని వయసుల వారికి ప్రయోజనకరమైన కార్యక్రమాలు చేయాలని లక్ష్యంగా పెట్టుకుని, యువతకు తగిన ప్రాధాన్యం ఇస్తూ ముందుకు వెళ్తోంది. రాబోయే ఈవెంట్ ఆగస్టు 13న ‘తామా వీక్లీ ఫ్రీ క్లినిక్ వాక్’, తదుపరి అనేక కార్యక్రమాలు చేయబోతున్నారు. మరిన్ని వివరములకు http://www.tama.org ని సందర్శించండి లేదా [email protected] కి ఇమెయిల్ పంపండి.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం
- తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్, కేసీఆర్
- యూఏఈలో విద్యా సంస్థల స్థాపకుడు భారతీయ ఎన్ఆర్ఐ కన్నుమూత
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!







