ఆర్టీసీ బిల్లుకు ఆమోదం తెలపని టి.గవర్నర్ తమిళిసై
- August 04, 2023
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC)ని ప్రభుత్వంలో విలీనం చేస్తామని బిఆర్ఎస్ ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు సిఎం కెసిఆర్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకుంది. ఇందుకు అనుగుణంగా ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టి, పాస్ చేయించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ బిల్లును రూపొందించింది.
ఆర్థిక పరమైన బిల్లు కావడంతో గవర్నర్ ఆమోదం కోసం ప్రభుత్వం పంపింది. కానీ గవర్నర్ తమిళిసై ఇంకా తన అభిప్రాయం చెప్పలేదు. రెండు రోజులుగా ఆమె నుంచి ఎలాంటి స్పందన లేదని బిఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణ రెండో అసెంబ్లీకి ఇదే చివరి సెషన్. శుక్ర, శనివారాల్లో మాత్రమే అసెంబ్లీ కొనసాగనుంది. ఈ సెషన్ ముగిసేలోగానే బిల్లును గవర్నర్ ఆమోదించాల్సి ఉంది. కానీ బిల్లును ఆమోదించే విషయంలో స్పష్టత రాకపోవడంతో ఆర్టీసీ కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తాజా వార్తలు
- నేపాల్‌కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్‌తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్‌బై
- ఈజిప్ట్‌కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్
- రాష్ట్రాన్ని మూడు విభాగాలుగా చేసి అభివృద్ధి: సీఎం రేవంత్
- యూఏఈ పై ఇరాన్ డ్రోన్ దాడి..తీవ్రంగా ఖండించిన జీసీసీ సెక్రటరీ జనరల్
- ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ కీలక భేటీ
- ఫోన్‌పే కొత్త ఫీచర్..నెట్ లేకుండానే పేమెంట్స్..!
- టపాసుల తయారీ కేంద్రంలో పేలుడు..ఎనిమిది మంది మృతి
- విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు యూఏఈ అధ్యక్షుడి శుభాకాంక్షలు







