కువైట్లో దంచికొడుతున్న ఎండలు. ఈ వారంతంలో 50 డిగ్రీలు దాటే అవకాశం
- August 04, 2023
కువైట్: ఈ వారంతంలో కువైట్ లోని కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 50 డిగ్రీల సెల్సియస్ ను దాటే అవకాశం ఉందని కువైట్ వాతావరణ శాఖ అంచనా వేసింది. డిపార్ట్మెంట్లోని చీఫ్ మెరైన్ ఫోర్కాస్టర్ యాసర్ అల్-బ్లౌషి మాట్లాడుతూ.. వేడి గాలులు కువైట్ అంతటా ప్రభావం చూపుతాయని, కొన్ని చోట్ల దుమ్ము తుఫాన్లు చెలరేగే అవకాశం కూడా ఉందన్నారు. అత్యధిక ఉష్ణోగ్రత 51 డిగ్రీలకు చేరుకునే అవకాశం ఉందని, తర్వాత రోజులలో అది 49 డిగ్రీలకు తగ్గుతుందని అంచనా వేశారు. రాత్రి వేళల్లో ఉష్ణోగ్రతలు 35-27 డిగ్రీల స్థాయికి తగ్గుతుందని పేర్కొన్నారు. అలాగే శుక్రవారం, ఉష్ణోగ్రత 47-49 డిగ్రీల స్థాయికి చేరుతుందని, కనిష్టంగా 33-35 డిగ్రీల పరిధిలో ఉంటుందన్నారు. శనివారం గరిష్ఠ ఉష్ణోగ్రతలు 50-48 డిగ్రీల స్థాయిలో ఉంటుందని, రాత్రి సమయంలో అత్యల్పంగా 32-35 డిగ్రీల వద్ద ఉంటుందని అల్-బ్లౌషి చెప్పారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







