ప్రయాణికులు, వారి కుటుంబ సభ్యులకు హైదరాబాద్ ఎయిర్‌పోర్టు విజ్ఞప్తి
- August 05, 2023
హైదరాబాద్: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో రద్దీ ఎక్కువగా ఉంటుండడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ప్రయాణికుల వెంట వచ్చి, వారికి స్వాగతం, వీడ్కోలు పలికే వారికి హైదరాబాద్ విమానాశ్రయం ఓ విజ్ఞప్తి చేసింది.
ప్రయాణికుల కోసం వచ్చే వారి స్నేహితులు, బంధువుల వల్ల విమానాశ్రయం ప్రాంతంలో పార్కింగ్ స్థలంతో పాటు ఇతర పరిసరాల్లో రద్దీ ఎక్కువగా ఉంటుందని తెలిపింది. ఫారన్ వెళ్తున్న విద్యార్థుల వెంట పరిమితికి మించి స్నేహితులు, కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున వస్తున్నారని, ఇటీవల వారి వల్ల విమానాశ్రయం ప్రాంతంలో రద్దీ పెరిగిందని చెప్పింది.
ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రయాణికులు, వారి బంధుమిత్రులు పరిమితంగా రావాలని విజ్ఞప్తి చేసింది. కాగా, శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో రద్దీ ఎక్కువ కావడంతో తాము ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి కొందరు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు చేశారు.
Traffic Advisory!#FlyHYD #HYDAirport #Advisory #TrafficAdvisory #Passenger #AirportSecurity pic.twitter.com/hluKwd4F14
— RGIA Hyderabad (@RGIAHyd) August 4, 2023
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







