ప్రమాదంలో గూగుల్ అకౌంట్. డిసెంబర్ 1 నుండి కొత్త నిబంధనలు
- August 05, 2023
యూఏఈ: గూగుల్ తన కొత్త ఇన్‌యాక్టివిటీ పాలసీని ఆగస్ట్ 4న విడుదల చేసింది. దీని ప్రకారం.. డిసెంబర్ 1 నుంచి యాక్టివ్‌గా లేని ఖాతాలను జీమెయిల్ అకౌంట్లను తొలగించడం ప్రారంభిస్తుంది. గూగుల్ ఖాతాల కోసం ఇనాక్టివిటీ వ్యవధిని రెండేళ్లకు అప్డేట్ చేసినట్లు వెల్లడించింది. వినియోగదారు రెండేళ్లలోపు లాగిన్ చేయకపోతే అకౌంట్ డీయాక్టివేట్ చేయనున్నట్లు గూగుల్ స్పష్టం చేసింది. ఒకసారి తొలగించిన తర్వాత అది పునరుద్ధరణ కాదని తెలిపింది. అయితే ఇ-మెయిల్ అకౌంట్ ను, కంటెంట్ ను తొలగించే ముందు సంబంధిత వినియోగదారులకు అనేకసార్లు రిమైండర్ లను పంపుతామని స్పష్టం చేసింది.
YouTube ఖాతాలను కూడా తొలగిస్తారా?
YouTube గూగుల్ యాజమాన్యంలో ఉన్నందున, ప్రముఖ వీడియో-షేరింగ్ ప్లాట్‌ఫారమ్‌లోని అకౌంట్లు పాలసీ పరిధిలోకి వస్తాయా లేదా అనేది చాలామందిలో సందేహం ఉంది. "యూట్యూబ్ ఛానెల్‌లు, వీడియోలు లేదా వ్యాఖ్యలతో" ఖాతాలకు పాలసీ నుండి మినహాయింపు ఉందని గూగుల్ తెలిపింది.
ఖాతాను యాక్టివ్‌గా ఉంచుకోవడం ఎలా?
వినియోగదారులు తమ ఖాతాలను యాక్టివ్ గా ఉంచడంలో సహాయపడే కొన్ని సులభమైన మార్గాలను గూగుల్ వెల్లడించింది. ఇ-మెయిల్ చదవడం లేదా పంపడం, గూగుల్ డిస్క్‌ని ఉపయోగించడం, యూట్యూబ్ వీడియో చూడటం, ఫోటో షేర్, యాప్‌ను డౌన్లోడ్, గూగుల్ సెర్చ్, యాప్ లు లేదా ఇతర సేవలకు గూగుల్ అకౌంట్ తో సైన్ ఇన్ చేయాలని సూచించింది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







