ఉక్రెయిన్ సంక్షోభం. చర్చలకు సౌదీ అరేబియా ఆతిథ్యం
- August 05, 2023
జెడ్డా: ఉక్రెయిన్-రష్యా యుద్ధంపై చర్చించేందుకు సౌదీ అరేబియా శనివారం జెడ్డాలో జాతీయ భద్రతా సలహాదారులు, అనేక దేశాల ప్రతినిధులకు ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ సమావేశం ఉక్రేనియన్ సంక్షోభాన్ని పరిష్కరించడానికి క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ చేసిన మానవతా కార్యక్రమంలో భాగంగా ఉంది. సంక్షోభం ప్రారంభం నుండి రష్యా -ఉక్రేనియన్ నాయకత్వాలతో ఆయన టచ్ లో ఉన్నారు. రెండు దేశాల మధ్య శాశ్వత శాంతికి దారితీసే పరిష్కారాన్ని చేరుకోవడంలో ఈ సమావేశం దోహదపడుతుందని, సంక్షోభం ప్రభావాలను తగ్గిస్తుందని సౌదీ అధికార యంత్రాంగం పేర్కొంది. దౌత్య మార్గాల ద్వారా సంక్షోభానికి రాజకీయ పరిష్కారాన్ని కనుగొనే మార్గాలపై అంతర్జాతీయ స్థాయిలో అభిప్రాయాలు, సమన్వయం, సహకారాన్ని బలోపేతం చేయడానికి ఈ సమావేశం దోహదపడుతుందని సౌదీ ప్రభుత్వం తెలిపింది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







