శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అక్రమ బంగారం పట్టివేత..
- August 06, 2023
హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో బంగారాన్ని అక్రమంగా తరలిస్తూ పట్టుబడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. అధికారులు ఎంత నిఘాపెట్టినా బంగారం అక్రమ రవాణా మాత్రం ఆగడం లేదు. విదేశాల నుంచి వచ్చే వారు అక్రమ పద్దతుల్లో గోల్డ్‌ను తీసుకుని వస్తున్నారు. రకరకాల పద్ధతుల్లో గోల్డ్ స్మగ్లింగ్‌కు పాల్పడుతున్నారు. అయితే, అక్రమంగా బంగారాన్ని తలిస్తున్న వారికి కస్టమ్స్ అధికారులు చెక్ పెడుతున్నారు. తాజాగా మరోసారి ఇలాంటి ఘటన శంషాబాద్ ఎయిర్ పోర్టులో చోటుచేసుకుంది.
శంషాబాద్ ఎయిర్ పోర్టులో కస్టమ్స్ అధికారులు ఆదివారం అక్రమంగా బంగారాన్ని తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. ఇండిగో విమానంలో జెడ్డా నుంచి హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు ఇద్దరు ప్రయాణికులు వచ్చారు. ఈ క్రమంలో ఎయిర్ పోర్టు కస్టమ్స్ అధికారులు తనిఖీలు నిర్వహించగా.. వారి వద్ద రూ. కోటి విలువైన అక్రమ బంగారాన్ని గుర్తించారు.
ప్రయాణికుల వద్ద ఫోర్ టేబుల్ స్పీకర్స్, ఐరన్ బాక్స్‌లో 1.88 కిలోల అక్రమ బంగారంను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. బంగారం తరలిస్తున్నారనే పక్కా సమాచారంతో వారిని కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద పట్టుబడ్డ బంగారం విలువ బహిరంగ మార్కెట్ లో 1.11 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. బంగారం స్వాధీనం చేసుకున్న కస్టమ్స్ అధికారులు నిందితులను విచారణ చేపట్టారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







