అమృత్ భారత్ స్టేషన్ పథకాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ..
- August 06, 2023
అమృత్ భారత్ స్టేషన్ పథకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ గా ప్రారంభించారు. దేశవ్యాప్తంగా 508 రైల్వే స్టేషన్ లలో అభివృద్ధి పనులకు ప్రధాని మోదీ వర్చువల్ గా శంకుస్థాపన చేశారు. స్థానిక సంస్కృతి, వారసత్వం నిర్మాణానికి అనుగుణంగా ఆయా రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేయనున్నారు.
27 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఉన్న ఈ రైల్వే స్టేషన్ల అభివృద్ధి కోసం కేంద్రం మొత్తం రూ.25 వేల కోట్లు ఖర్చు చేయనుంది. ఆదివారం వీటికి మోదీ వర్చువల్ గా శంకుస్థాపన చేశారు. స్థానిక సంప్రదాయాలకు అనుగుణంగా రైల్వే స్టేషన్లకు మెరుగులు దిద్దడం, కొత్త మెరుగు సూచికల ఏర్పాటు, ఆధునిక మౌళిక వస్తువుల కల్పనకు నిధులు కేటాయించారు.
అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద 1,309 రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేయాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా ఒకేసారి 508 రైల్వే స్టేషన్ల అభివృద్ధి పనులను ప్రధాని మోదీ ప్రారంభించారు. తెలంగాణలో 39 రైల్వే స్టేషన్లను ఆధునీకరించాలని నిర్ణయించారు. తొలి విడతగా 21 రైల్వే స్టేషన్లలో అభివృద్ధి పనులకు శంకుస్థాన చేశారు.
తెలంగాణలో రూ.894 కోట్లతో రైల్వే ఆధునీకరణ పనులను మోదీ ప్రారంభించారు. ఇక ఏపీలో తొలి విడతగా 18 రైల్వే స్టేషన్లు అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. ఏపీలో రూ.453 కోట్లతో ఎంపిక చేసిన రైల్వే స్టేషన్లలో అభివృద్ధి పనులను ప్రధాని వర్చువల్ గా ప్రారంభించారు. వీటిలో ఏపీలోని కర్నూలు, తుని, తెనాలి, అనకాపల్లి, తాడిపల్లి వంటి రైల్వే స్టేషన్లను ఎంపిక చేశారు.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







