ఆకాశ ఎయిర్ ప్రతీ వారం 900 విమాన సర్వీసులు
- August 08, 2023
ముంబై: ఆకాశ ఎయిర్ ఈ ఏడాది డిసెంబరు నాటికి అంతర్జాతీయ మార్గాల్లో ప్రతీ వారం 900 విమాన సర్వీసులు నడిపేందుకు ప్రణాళిక రూపొందించింది. వారానికి 900 విమానాలతో 4.3 మిలియన్ల మంది ప్రయాణీకులను గమ్య స్థానాలకు చేరవేసిందని అకాసా ఎయిర్ తెలిపింది. వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభించిన మొదటి సంవత్సరంలో అంతర్జాతీయంగా ప్రయాణించేందుకు అర్హత సాధించింది.
ఆకాశ ఎయిర్ గత సంవత్సరం ఆగస్ట్ 7వతేదీన ముంబయి నుంచి అహ్మదాబాద్‌కు తన తొలి విమానంతో కార్యకలాపాలను ప్రారంభించింది. ఈ ఏడాది డిసెంబరు నాటికి అంతర్జాతీయ రూట్లలో విమానాలు నడిపేందుకు ప్లాన్ చేస్తున్నట్లు అకాసా ఇప్పటికే ప్రకటించింది. ఎస్ఎన్వీ ఏవియేషన్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యంలోని జెట్ ఎయిర్వేస్ మాజీ సీఈఓ వినయ్ దూబే, ఇతరులతో కలిసి ఎయిర్ ఆకాసాను స్థాపించింది.
వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభించిన మొదటి సంవత్సరంలో అకాసా ఎయిర్ 4.9 శాతం మార్కెట్ వాటాతో 4.3 మిలియన్ల ప్రయాణికులకు సేవలందించింది. 16 గమ్యస్థానాలలో 35 ప్రత్యేక మార్గాల్లో వారానికి 900కు పైగా విమానాలను నడిపే మైలురాయిని అధిగమించిందని ఎయిర్‌లైన్ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ సమయంలో తమ నెట్‌వర్క్‌లో 25,000 టన్నుల కార్గోను తీసుకువెళ్లినట్లు ఎయిర్‌లైన్స్ తెలిపింది. అకాసా ఎయిర్ 76 బోయింగ్ 737 మ్యాక్స్ ఎయిర్‌క్రాఫ్ట్ లు, 53 హై-కెపాసిటీ బి 737-8-200 ఎయిర్‌క్రాఫ్ట్‌ల కొనుగోలుకు ఆర్డర్ చేసింది.
తాజా వార్తలు
- మలేషియాలో ఘనంగా MYTA 13వ గ్రాండ్ బతుకమ్మ వేడుకలు
- దుబాయ్‌లో నకిలీ అనారోగ్య సెలవు ధ్రువపత్రాల జారీ.. క్లినిక్ క్లర్క్‌కు జైలు శిక్ష
- నో పార్కింగ్ ప్రాంతాల్లో వాహనాలు నిలిపితే వీల్ క్లాంప్లు..!!
- డిజిటల్, ఏఐ రంగాల్లో సహకారంపై బహ్రెయిన్, సౌదీ చర్చలు..!!
- ప్రాంతీయ ఉద్రిక్తతలను పెంచే ప్రయత్నాలు..యూఏఈ హెచ్చరిక..!!
- ఇంటర్నెట్ భద్రతలో ప్రపంచంలోనే నంబర్ వన్‌గా సౌదీ అరేబియా..!!
- ఖతార్‌లో రియల్ ఎస్టేట్ విక్రయాలు QR696.5 మిలియన్లు..!!
- ఒమన్‌లో రోడ్డుపై ప్రమాదకర స్టంట్లు.. డ్రైవర్ అరెస్ట్..!!
- హైదరాబాద్: భారీ అగ్నిప్రమాదం.. మదీనా క్రాస్‌రోడ్డు బట్టల గోడౌన్లో ఎగసిపడ్డ మంటలు
- ‘అరబ్ హోప్ మేకర్స్’ ఏడో ఎడిషన్ ప్రారంభం.. విజేతకు రూ. కోట్లు విలువైన బహుమతి..!







