పార్లమెంట్: అవిశ్వాస తీర్మానంపై చర్చ..
- August 08, 2023
న్యూఢిల్లీ: నేటి పార్లమెంటు సమావేశాలు అట్టుడకబోతున్నాయి. మోడీ ప్రభుత్వంపై విపక్ష కూటమి ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై ఈరోజు చర్చ ప్రారంభం కాబోతోంది. రెండు రోజుల చర్చ తర్వాత ఎల్లుండి ఓటింగ్ జరగనుంది. అవిశ్వాస తీర్మానంపై చర్చను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రారంభించనున్నారు. విపక్షాల అవిశ్వాస తీర్మానం నేపథ్యలో ఈరోజు బిజెపి పార్లమెంటరీ పార్టీ సమావేశమయింది. సభలో విపక్షాలను ఎలా ఎదుర్కోవాలనే దానిపై బిజెపి ఎంపీలకు ఈ సమావేశంలో మార్గనిర్దేశం చేశారు. మరోవైపు సభలో బిజెపికి ఎక్కువ మెజార్టీ ఉన్న నేపథ్యంలో అవిశ్వాస తీర్మానం ఎట్టి పరిస్థితుల్లో గట్టెక్కే అవకాశమే లేదు. మణిపూర్ అంశంపై పార్లమెంట్ లో ప్రధాని మోడీ ప్రకటన చేయాలని విపక్షాలు పట్టుబడుతున్నాయి. అయితే, ఆయన ఈ అంశంపై సభలో మోడీ ఇంతవరకు స్పందించలేదు. దీంతో, కేంద్ర ప్రభుత్వంపై విపక్షాలు అవిశ్వాస తీర్మానం పెట్టాయి.
అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా కేంద్ర తరపున ఐదుగురు మంత్రులు మాట్లాడతారు. వీరిలో అమిత్ షా, నిర్మలా సీతారామన్, స్మృతి ఇరానీ, జ్యోతిరాదిత్య సింధియా, కిరణ్ రిజిజు ఉన్నారు. వీరితో పాటు మరో ఐదుగురు ఎంపీలు చర్చలో పాల్గొంటారు. మరోవైపు అవిశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా ఎన్డీయేకు బిజు జనతాదళ్, వైఎస్‌ఆర్‌సిపిలు కూడా మద్దతు తెలిపాయి. దీంతో ఎన్డీయే సంఖ్యా బలం మరింత పెరిగింది. ఈ రెండు పార్టీలకు 34 మంది ఎంపీలు ఉండటం గమనార్హం. అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా మోడీ సభకు గైర్హాజరు కానున్నారు. ప్రధాని లేకుండానే చర్చ జరగబోతోంది.
తాజా వార్తలు
- నేపాల్ వరదలు, కొండచరియల బాధితులకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల సాయం
- టెహ్రాన్‌లో ఖతార్ ప్రధాని పర్యటన.. ఉద్రిక్తతల తగ్గింపుపై ఇరాన్‌తో చర్చలు
- పాఠశాలలు పునఃప్రారంభం: అజ్మాన్‌లో ప్రభుత్వ ఉద్యోగులకు సడలింపు
- వాట్సాప్‌లో అదిరిపోయే ఫీచర్లు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్‌లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్‌లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!







