వేములవాడ బయోగ్యాస్ ప్లాంట్‌ను ప్రారంభించిన మంత్రి కెటిఆర్
- August 08, 2023
తెలంగాణ: మంత్రి కేటీఆర్ నేడు జిల్లా పర్యటనలో భాగంగా వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. వేములవాడ ఏరియా దవాఖాన సమీపంలో గోశాల ఆవరణలో రూ.31 లక్షలతో ఏర్పాటు చేసిన బయోగ్యాస్ ప్లాంటును ప్రారంభించారు. మహాలక్ష్మి అమ్మవారి ఆలయం సమీపంలో మిషన్ భగీరథ, మూల వాగు వద్ద అత్యాధునిక హంగులతో ఏర్పాటుచేసిన వాకింగ్ ట్రాక్‌ను, శ్యామకుంట జంక్షన్ వద్ద కూరగాయల మార్కెట్‌ను ప్రారంభిస్తారు. బద్ది పోచమ్మ ఆలయం అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. భక్తుల సౌకర్యార్థం 100 గదుల కాంప్లెక్స్ నిర్మాణానికి భూమిపూజ చేస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో బీసీ బంధు పథకంలో భాగంగా 600 మందికి చెక్కులను పంపిణీ చేస్తారు.
తాజా వార్తలు
- నేపాల్ వరదలు, కొండచరియల బాధితులకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల సాయం
- టెహ్రాన్‌లో ఖతార్ ప్రధాని పర్యటన.. ఉద్రిక్తతల తగ్గింపుపై ఇరాన్‌తో చర్చలు
- పాఠశాలలు పునఃప్రారంభం: అజ్మాన్‌లో ప్రభుత్వ ఉద్యోగులకు సడలింపు
- వాట్సాప్‌లో అదిరిపోయే ఫీచర్లు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్‌లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్‌లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!







