‘గేమ్ ఛేంజర్’ అప్డేట్.! ఇదిగో.!
- August 08, 2023
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న సినిమా ‘గేమ్ ఛేంజర్’. శంకర్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. అయితే, శంకర్ ‘ఇండియన్ 2’ సినిమాతో బిజీగా వుండడం వల్ల ఈ సినిమాని లైట్ తీసుకున్నారన్న టాక్ వినిపించింది ఈ మధ్య.
అయితే, ఇప్పటికే ఈ సినిమా 70 శాతం షూటింగ్ పూర్తి చేసుకుందనీ, నవంబర్ నాటికి షూటింగ్ పూర్తి కానుందనీ తాజా సమాచారం. అలాగే ఈ సినిమాలో రామ్ చరణ్ డ్యూయల్ రోల్ పోషిస్తున్న సంగతి ఇప్పటికే లీక్ అయిన సంగతి తెలిసిందే.
అందులో ఒకటి రాజకీయ నాయకుడి పాత్ర కాగా, ఇంకోటి ఐఏఎస్ అధికారి పాత్ర అని తెలుస్తోంది. తండ్రీ కొడుకుల పాత్రలనీ తెలుస్తోంది. తండ్రి పాత్ర పేరు అప్పన్న, కొడుకు పాత్ర పేరు రామ్ నందన్ కుమార్.. అని తాజాగా ఓ న్యూస్ బయటికొచ్చింది. సమాజ హితం కోరే ఓ మంచి పొలిటీషియన్ పాత్రగా అప్పన్న పాత్ర వుండబోతోందట. అంజలి ఈ పాత్రకు జోడీగా నటిస్తోంది. అలాగే, యంగ్ రామ్ చరణ్ పాత్రకు కైరా అద్వానీ జోడీగా నటిస్తోంది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







