అదే చిరంజీవి గొప్పతనం.!
- August 09, 2023
రీల్ చిరంజీవి అంటే అందరికీ అభిమానమే. కానీ, రియల్ లైఫ్లో చిరంజీవిని చూస్తే అభిమానిగా కాదు, భక్తుడైపోతారు.. అని చాలా మంది చెబుతుంటారు. తాజాగా జబర్దస్త్ కమెడియన్ గెటప్ శీను, చిరంజీవిని వుద్దేశించి ఈ మాట చెప్పారు.
చిరంజీవి తాజా సినిమా ‘భోళా శంకర్’ ప్రమోషన్లలో భాగంగా సినిమాలో నటించిన కమెడియన్లు గెటప్ శీను, వైవా హర్ష, లోబో, తాగుబోతు రమేష్.. ఇలా చాలా మంది కమెడియన్లతో కలిసి చిరంజీవి ఓ సరదా ఇంటర్వ్యూ చేశారు.
ఈ ఇంటర్వ్యూలో భాగంగా కమెడియన్లంతా చిరంజీవికి తమ కృతజ్ఢతలు తెలుపుకున్నారు. లోబో అయితే, ‘భోళా శంకర్’ రిలీజ్ డే తర్వాత తాను చనిపోయినా ఫర్వాలేదు.. అంటూ తన ఎమోషన్ బయటపెట్టాడు. చిరంజీవితో కలిసి స్ర్కీన్ షేర్ చేసుకోవడమన్నది తమకు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అనీ, ఆ కల నెరవేరినందుకు ఈ జీవితానికి ఆ భాగ్యం చాలన్నదే వారి వుద్దేశ్యం.
వారి వారి టాలెంట్స్ గుర్తించిన చిరంజీవి చాలా మంది కమెడియన్లకు ఈ సినిమాలో ఛాన్స్ ఇచ్చారు. చిన్న చిన్న సన్నివేశాలే అయినా వారందర్నీ ఎంతో చక్కగా హ్యాండిల్ చేశాడట మెహర్ రమేష్. ఆగస్టు 11న ‘భోళా శంకర్’ ప్రేక్షకుల ముందుకు రానుంది. కేవలం మెగా అభిమానుల్నే కాదు, అన్ని వర్గాల వారినీ ఈ సినిమా అలరిస్తుందని ఈ ఇంటర్వ్యూలో చిరంజీవి చెప్పారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







