కూల్ అండ్ కామ్ గోయింగ్.! రౌడీ మారిపోయాడు.!
- August 09, 2023
విజయ్ దేవరకొండ, సమంత జంటగా ‘ఖుషి’ చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్‌లో ఈ సినిమా రిలీజ్‌కి సిద్ధంగా వుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్లు వేగవంతం చేశారు.
అయితే, విజయ్ దేవరకొండ సినిమాలంటే, గతంలో ఏ రేంజ్‌లో ప్రమోట్ చేసేవాడో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కానీ, ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయ్. అంత అగ్రెసివ్‌గా ప్రమోషన్లు చేయకూడదని విజయ్ దేవరకొండ డిసైడ్ అయ్యాడట.
కూల్ అండ్ కామ్‌గా మాత్రమే ప్రమోషన్ చేయాలని అనుకుంటున్నాడట. నార్త్‌లో అయితే, అస్సలు ఇంట్రెస్ట్ చూపించడం లేదట. ఇంతలా విజయ్ దేవరకొండలో మార్పు రావడానికి కారణం ‘లైగర్’ డిజాస్టరే.
ఈ సినిమాతో చాలా చాలా డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాడు విజయ్ దేవరకొండ. తేరుకోవడానికే చాలా టైమ్ పట్టింది. ఎలాగోలా ‘ఖుషి’ సినిమా పూర్తి చేశాడు. అయితే, ఈ సినిమాకి బజ్ బాగానే వచ్చింది. ఈ బజ్‌ని ఇలాగే పాజిటివ్‌గా వుంచుకుని, ఒళ్లు దగ్గరపెట్టుకుని ప్రమోషన్లలో పాల్గొనాలని అనుకుంటున్నాడట. అదీ సంగతి.
తాజా వార్తలు
- రవీంద్ర భారతిలో ఎస్పీ బాలు విగ్రహావిష్కరణ..పాల్గొన్న ప్రముఖులు
- IPL మినీ ఆక్షన్‌లో కొత్త రూల్...
- జోర్డాన్ చేరుకున్న ప్రధాని మోదీ..
- కోఠి ఉమెన్స్ కాలేజీలో వేధింపులు..
- 2029 ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేస్తా: కవిత
- శ్రీమతి ఆంధ్రప్రదేశ్ 2025గా హేమలత రెడ్డి ఎంపిక…
- రవీంద్రభారతిలో ఎస్పీబాలు విగ్రహావిష్కరణ
- న్యూ ఇయర్ వేడుకలకు సీపీ సజ్జనార్ కీలక మార్గదర్శకాలు
- తామ్కీన్, SIO ఫ్రాడ్ కేసులో 10 ఏళ్ల జైలుశిక్షలు..!!
- సకాన్ హౌజింగ్ యూనిట్ల కేటాయింపు ప్రారంభం..!!







