ఒమన్ ఆకాశంలో ఆగస్ట్ 12 నుంచి పెర్సీడ్స్ ఉల్కాపాతం

- August 10, 2023 , by Maagulf
ఒమన్ ఆకాశంలో ఆగస్ట్ 12 నుంచి పెర్సీడ్స్ ఉల్కాపాతం

మస్కట్: ఒమన్ సుల్తానేట్ ఆకాశంలో ఆగస్ట్ 12 రాత్రి నుండి ఆగస్ట్ 24 వరకు కొనసాగే పెర్సీడ్స్ ఉల్కాపాతాన్ని చూసే అవకాశం ఉంది. ఒమన్ ఆస్ట్రోనామికల్ సొసైటీ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడు అష్వాక్ నాసర్ అల్ సియాబీ మాట్లాడుతూ.. ఈ ఉల్కాపాతాన్ని చీకటి ప్రదేశం నుండి చూస్తూ అద్భుతంగా కనిపిస్తుందన్నారు. ఈ శని-ఆదివారం ఉల్కలకి స్పష్టమైన మూలమైన పెర్సియస్ టవర్‌కు దగ్గరగా ఈశాన్యంలో స్టార్‌గేజర్ గమనించవచ్చని అష్వాక్ సూచించారు. స్టార్‌గేజర్‌లు, ఆస్ట్రోఫోటోగ్రఫీ ఔత్సాహికులు మామూలు చూపుతోనే వీటిని స్పష్టంగా చూడవచ్చని పేర్కొన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com