ఎమిరాటీస్ నుండి Dh2.32 మిలియన్ల రికవరీ
- August 10, 2023
యూఏఈ: ప్రైవేట్ రంగంలో కల్పిత ఉద్యోగాలను అంగీకరించిన 107 యూఏఈ పౌరుల నుండి మానవ వనరులు మరియు ఎమిరేటైజేషన్ మంత్రిత్వ శాఖ (మోహ్రే) Dh2.32 మిలియన్ల కంటే ఎక్కువ విలువైన ఆర్థిక సహాయాన్ని రికవరీ చేసింది. ఈ ఎమిరాటీలు Nafis ప్రోగ్రామ్ కింద ప్రైవేట్ రంగంలో ఫేక్ ఉద్యోగాలను పొందారు. "మా సిస్టమ్‌లు నిజమైన ఉద్యోగాలలో ఎమిరాటీలను నియమించుకోవడంలో కంపెనీల సమ్మతిని ట్రాక్ చేస్తాయి. వేతన రక్షణ వ్యవస్థ (WPS) ద్వారా యూఏఈలోని మంత్రిత్వ శాఖ, పెన్షన్ ఫండ్‌ల ద్వారా వారికి జీతాలు చెల్లిస్తాయి" అని మోహ్రే తెలిపింది. చట్టం ప్రకారం.. యూఏఈలోని కంపెనీలు ప్రతి సంవత్సరం నైపుణ్యం కలిగిన పాత్రలలో 2 శాతం ఎమిరాటీలను చేర్చుకోవాల్సి ఉంటుంది. ప్రైవేట్ రంగంలో ఎమిరాటైజేషన్‌ను పెంచడానికి ఆర్థిక మద్దతు, ప్రయోజనాలను నఫీస్(Nafis) అందిస్తుంది. యూఏఈ పౌరులు నకిలీ ఎమిరేటైజేషన్ ఉద్యోగాల ద్వారా మోసపోవద్దని మోహ్రే కోరింది. 600590000 లేదా మంత్రిత్వ శాఖ యాప్ లేదా వెబ్‌సైట్ ద్వారా ఉల్లంఘనలను నివేదించాలని నివాసితులను కోరింది. జూలై నెలలో నకిలీ ఎమిరేటైజేషన్‌కు సంబంధించిన 436 కంపెనీలపై జరిమానాలు, పరిపాలనా ఆంక్షలను మంత్రిత్వ శాఖ విధించింది.
తాజా వార్తలు
- హమద్ పోర్టులో ఆడియో స్పీకర్లలో షాబు..!!
- అనుమతి లేకుండా వ్యక్తిగత డేటా బహిర్గతం..తీవ్రమైన నేరం..!!
- అబుదాబి-దుబాయ్ E11లో EV మెగాహబ్..!!
- 1,197 మంది ప్రవాసులను బహిష్కరించిన కువైట్..!!
- ముసందంలో డిస్కవరీ డైవింగ్ సెంటర్.. టూరిజానికి బూస్ట్..!!
- 2025లో కుటుంబం,బాలల రక్షణకు 4,400 రిపొర్టులు..!!
- ఇరాన్ నాయకత్వానికి ట్రంప్ బిగ్ వార్నింగ్
- పలు కార్యక్రమాల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- 'మన శంకర వర ప్రసాద్ గారు’ ప్రీమియర్ను నిర్వహించిన జనసేన గల్ఫ్సేన
- అంధుల మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ దీపికకు అరుదైన గౌరవం







