యూఏఈలో జూన్ నుండి 22 క్లౌడ్-సీడింగ్ మిషన్లు

- August 10, 2023 , by Maagulf
యూఏఈలో జూన్ నుండి 22 క్లౌడ్-సీడింగ్ మిషన్లు

యూఏఈ: ఇటీవల ఎమిరేట్స్ లో వర్షాలను పెంచడం కోసం జూన్ నెల నుండి యూఏఈలో ఇరవై రెండు క్లౌడ్-సీడింగ్ మిషన్లు నిర్వహించబడ్డాయని నేషనల్ సెంటర్ ఆఫ్ మెటియోరాలజీ (NCM) తెలిపింది. ఈ వారాంతంలో దేశంలో మరిన్ని వర్షాలు కురుస్తాయని, ముఖ్యంగా ఫుజైరా,  షార్జా,  అల్ ఐన్,  దుబాయ్ మధ్య ఉంటాయని NCM ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. “మేము ప్రతి సంవత్సరం క్లౌడ్-సీడింగ్ కార్యకలాపాలను నిర్వహిస్తాము. దీంతో వర్షపాతం పెరుగుతుంది. కానీ ఈ కార్యకలాపాలు వర్షపాతాన్ని పెంచుతాయే తప్ప అది వర్షాన్ని సృష్టించదు. జూన్ నుండి ఆగస్టు 9 వరకు, మేము 22 క్లౌడ్-సీడింగ్ కార్యకలాపాలను నిర్వహించాము ”అని నేషనల్ సెంటర్ ఆఫ్ మెటియోరాలజీ (NCM) డాక్టర్ అహ్మద్ హబీబ్ వివరించారు. 1990ల చివరలో యూఏఈలో వర్షపు మెరుగుదల మిషన్లు ప్రారంభమయ్యాయి.       

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com