దోహా మెట్రో సేవల్లో కీలక మార్పులు
- August 10, 2023
దోహా: దోహా మెట్రో గ్రీన్ లైన్లో తన నెట్వర్క్ సేవల్లో కొన్ని మార్పులను ప్రకటించింది. మెట్రో నిర్వహణ పనులను నిర్వహించడానికి గ్రీన్ లైన్ మెట్రోలో ఆగష్టు 11న ప్రత్యామ్నాయ బస్సులను నడుపుతుంది. మూడు మార్గాల్లో ప్రతి 10 నిమిషాలకు బస్సులు నడుస్తాయి. ఒకటి అల్ బిడ్డా నుండి అల్ రిఫా మాల్ ఆఫ్ ఖతార్ వరకు, రెండవది అల్ రిఫ్ఫా మాల్ ఆఫ్ ఖతార్ నుండి అల్ బిడ్డా వరకు తిరుగు ప్రయాణం, మూడవ మార్గంలో అల్ మన్సౌరా మరియు అల్ దోహా అల్ జదీదా మధ్య షటిల్ సర్వీస్ ఉంటుంది. ఈ బస్సులు వైట్ ప్యాలెస్ స్టేషన్లో ఆగవని దోహా మెట్రో పేర్కొంది. ఇదిలా ఉండగా మెట్రోఎక్స్‌ప్రెస్, మెట్రోలింక్ యథావిధిగా పనిచేస్తాయని తెలిపింది.
తాజా వార్తలు
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్‌లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు
- ఆటిజం పై అపోహలు వీడాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- సౌదీలో ఉద్రిక్తతలు.. రియాద్‌కు ఇండిగో, ఎయిరిండియా విమాన సర్వీసులు రద్దు
- శ్రీవారి భక్తుల కోసం ‘గరుడ’ యాప్







