యూఏఈలో జూన్ నుండి 22 క్లౌడ్-సీడింగ్ మిషన్లు
- August 10, 2023
యూఏఈ: ఇటీవల ఎమిరేట్స్ లో వర్షాలను పెంచడం కోసం జూన్ నెల నుండి యూఏఈలో ఇరవై రెండు క్లౌడ్-సీడింగ్ మిషన్లు నిర్వహించబడ్డాయని నేషనల్ సెంటర్ ఆఫ్ మెటియోరాలజీ (NCM) తెలిపింది. ఈ వారాంతంలో దేశంలో మరిన్ని వర్షాలు కురుస్తాయని, ముఖ్యంగా ఫుజైరా, షార్జా, అల్ ఐన్, దుబాయ్ మధ్య ఉంటాయని NCM ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. “మేము ప్రతి సంవత్సరం క్లౌడ్-సీడింగ్ కార్యకలాపాలను నిర్వహిస్తాము. దీంతో వర్షపాతం పెరుగుతుంది. కానీ ఈ కార్యకలాపాలు వర్షపాతాన్ని పెంచుతాయే తప్ప అది వర్షాన్ని సృష్టించదు. జూన్ నుండి ఆగస్టు 9 వరకు, మేము 22 క్లౌడ్-సీడింగ్ కార్యకలాపాలను నిర్వహించాము ”అని నేషనల్ సెంటర్ ఆఫ్ మెటియోరాలజీ (NCM) డాక్టర్ అహ్మద్ హబీబ్ వివరించారు. 1990ల చివరలో యూఏఈలో వర్షపు మెరుగుదల మిషన్లు ప్రారంభమయ్యాయి.
తాజా వార్తలు
- ఆన్లైన్ షాపింగ్ సులభం చేసే కొత్త ఫీచర్
- డిజిపి చేతుల మీదుగా ‘కాల్ ఫర్ బ్లడ్’ వెబ్ యాప్ ప్రారంభం
- చైనాలో ఒంటరిగా ఉండేవారిని కాపాడే యాప్
- పొంగల్ వేడుకల్లో పాల్గొన్న ప్రధాని మోదీ
- ఐఐటీ హైదరాబాద్‌లో ఫైర్‌సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు
- ఖతార్ విజిటర్లలో 35% మంది గల్ఫ్ దేశాల వారే..!!
- సౌదీలో 89 నాన్ ప్రాఫిట్ సంస్థలపై విచారణ..!!
- దుబాయ్‌లో రియల్ మార్కెట్ మందగమనంలో ఉందా? నిజమెంత?
- నివాస ప్రాంతాలలో కొత్త ప్రైవేట్ స్కూళ్లకు అనుమతి లేదు..!!
- ఒమన్ లో మినిస్టర్స్, అఫిషియల్స్ ప్రమాణ స్వీకారం..!!







