దుబాయ్‌కి చేరుకున్న భారత యుద్ధనౌకలు
- August 10, 2023
దుబాయ్: ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ వెస్ట్రన్ ఫ్లీట్ (FOCWF) రియర్ అడ్మిరల్ వినీత్ మెక్‌కార్టీ ఆధ్వర్యంలో భారత నౌకాదళానికి చెందిన ఐఎన్ఎస్ విశాఖపట్నం, ఐఎన్ఎస్ త్రిఖండ్ అనే రెండు నౌకలు దుబాయ్‌లోని పోర్ట్ రషీద్‌కు చేరుకున్నాయి. ఇవి 'జాయెద్ తల్వార్' పేరుతో నిర్వహించే ద్వైపాక్షిక ఎక్సర్ సైజుల్లో పాల్గొననున్నాయి. ఈ రెండు నౌకలు ఆగస్టు 8 నుండి ఆగస్టు 11 వరకు పోర్ట్ రషీద్‌ను సందర్శిస్తాయని భారత రక్షణ మంత్రిత్వ శాఖ అధికారిక ప్రకటనలో తెలిపింది. రెండు దేశాల నౌకాదళాల మధ్య సహకారాన్ని పెంపొందించడానికి మరియు సంబంధాలను బలోపేతం చేయడానికి ఉత్తమ పద్ధతులను షేర్ చేసుకుంటాయని పేర్కొన్నారు. దీంతోపాటు ఈ పర్యటన రెండు నౌకాదళాల మధ్య సముద్ర భాగస్వామ్యాన్ని పెంచుతుందన్నారు.
ఇదిలా ఉండగా.. 1972లో ఇండియా, యూఏఈ దౌత్య సంబంధాలను ఏర్పరచుకున్నాయి. యూఏఈ తన రాయబార కార్యాలయాన్ని 1972లో ఢిల్లీలో ప్రారంభించింది. అయితే భారతదేశం 1973లో అబుధాబిలో తన రాయబార కార్యాలయాన్ని ప్రారంభించిందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







