కువైట్ లో 'బార్బీ' సినిమాపై నిషేధం

- August 10, 2023 , by Maagulf
కువైట్ లో \'బార్బీ\' సినిమాపై నిషేధం

కువైట్: కువైట్‌లో "బార్బీ" మరియు "టాక్ టు మీ" చిత్రాల ప్రదర్శనను నిషేధిస్తూ కువైట్ సమాచార మంత్రిత్వ శాఖ కమిటీ నిర్ణయం తీసుకుంది. పబ్లిక్ ఎతిక్స్, సోషల్ ట్రెడిషన్స్ పరిరక్షణకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రెస్ అండ్ పబ్లికేషన్ మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ లాఫీ అల్-సుబేయి తెలిపారు. "రెండు సినిమాలు కువైట్ సమాజానికి.. ప్రజల నమ్మకాలకు విరుద్ధంగా ప్రభావితం చేస్తున్నాయని కమిటీ పేర్కొంది," అని కమిటీ అధిపతి అల్-సుబెయి వెల్లడించారు. “ఏదైనా విదేశీ సినిమాపై నిర్ణయం తీసుకునేటప్పుడు, కమిటీ సాధారణంగా పబ్లిక్ ఎతిక్స్ కు విరుద్ధంగా ఉండే సన్నివేశాలను సెన్సార్ చేయాలని ఆదేశిస్తుంది.’’ అని పేర్కొన్నారు. "కానీ ఒక సినిమా సందేశం లేదా ఆమోదయోగ్యం కాని ప్రవర్తనను కలిగి ఉన్న సందర్భంలో మొత్తంగా సినిమాను నిషేధించాలని కమిటీ నిర్ణయిస్తుంది." అని, ఈ నియమం అన్ని విదేశీ సినిమా నిర్మాణాలకు వర్తిస్తుందని ఆయన వివరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com