పవన్ కల్యాణ్ రిషికొండ పర్యటన పై పోలీసుల నోటీసులు
- August 11, 2023
విశాఖపట్నం: జనసేన అధినేత పవన్ కల్యాణ్ విశాఖలోని రుషికొండ పరిశీలనకు వెళ్తున్న పర్యటనపై పోలీసులు ఆంక్షలు విధించారు. జోడుగుళ్లపాలెం నుంచి ఎవరినీ అనుమతించబోమని నోటీసుల్లో పోలీసులు పేర్కొన్నారు. ర్యాడిసన్ బ్లూ హోటల్ నుంచి కేవలం పవన్ వాహనానికి మాత్రమే అనుమతి ఉందని చెప్పారు. రుషికొండకు ఎదురుగా ఉన్న రోడ్డులోనే పవన్ వెళ్లాలని, కొండపైకి వెళ్లకూడదని కండిషన్ పెట్టారు. కావాలనుకుంటే గీతం యూనివర్శిటీ వద్ద మీడియాతో మాట్లాడవచ్చని చెప్పారు.
మరోవైపు వారాహి యాత్రలో భాగంగా నిన్న చేసిన వ్యాఖ్యలకు గాను పవన్ కు పోలీసులు నోటీసులు ఇచ్చారు. రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేశారని నోటీసుల్లో పేర్కొన్నారు. నిబంధనలను ఉల్లంఘించారని, అలా వ్యవహరించకుండా ఉండాల్సిందని అన్నారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయరాదని, విద్వేషాలు రగిల్చే వ్యాఖ్యలు చేయరాదని, పోలీసుల నిబంధనలు పాటించాలని, షెడ్యూల్ వివరాలను ముందే ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







