హవాయి దీవుల్లో కార్చిచ్చు.. 67కు చేరిన మృతుల సంఖ్య
- August 12, 2023
న్యూయార్క్: అమెరికాలోని హవాయి దీవుల్లో సంభవించిన కార్చిచ్చు వల్ల మరణించిన వారి సంఖ్య 67కు చేరుకున్నది. ఆ రాష్ట్ర చరిత్రలోనే ఇది అతిపెద్ద జాతీయ విపత్తుగా నిలిచింది. ఇంకా వందల సంఖ్యలో జనం మిస్సైనట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. లహైనా పట్టణం దాదాపు చాలా వరకు కాలిపోయింది. అయితే ప్రజలు శుక్రవారం మళ్లీ ఆ పట్టణానికి రావడం ప్రారంభించారు. రాత్రి పూట ఆ పట్టణంలో కర్ఫ్యూ విధించారు. కొన్ని ప్రాంతాలకు మాత్రం కేవలం సెర్చ్, రెస్క్యూ బృందాలను మాత్రమే అనుమతిస్తున్నారు. లహైనాకు ఇంకా నీటి, విద్యుత్తు సరఫరా జరగడం లేదు. మంటల్లో అన్నీ కోల్పోయిన బాధితుల కోసం అన్వేషణ జరుగుతోంది. పట్టణంలో ఉన్న హార్బర్ వద్ద నీటిలో దాచుకున్న 17 మందిని ప్రాణాలతో రక్షించారు. కార్చిచ్చు వల్ల లహైనా పట్టణంలో దాదాపు వెయ్యికిపైగా ఇండ్లు కాలిపోయాయి.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







