‘ఢిల్లీ సర్వీసెస్ బిల్లు’కు రాష్ట్రపతి ఆమోదం
- August 12, 2023
న్యూఢిల్లీ: ఢిల్లీ సర్వీస్ బిల్లు ఎట్టకేలకు చట్టరూపం దాల్చింది. తాజాగా ఈ బిల్లుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. దేశ రాజధాని ఢిల్లీలో బ్యూరోక్రాట్ల నియామకాలు, బదిలీలకు సంబంధించిన బిల్లును ఆమోదించినట్లు రాష్ట్రపతి భవన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. పార్లమెంటు ఉభయసభలు ఆమోదించిన నేషనల్ క్యాపిటల్ సర్వీసెస్ బిల్లుపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతకం చేశారు. ఇకనుంచి ఢిల్లీలో ఉన్నతాధికారుల నియామకం, బదిలీలకు సంబంధించి తుదినిర్ణయం లెఫ్టినెంట్ గవర్నర్ తీసుకోనున్నారు.
అధికారుల నియామకం, బదిలీల అంశంపై ఆప్ సర్కార్ చాలా రోజులుగా కేంద్రంపై పోరాడుతోంది. ఈ నేపథ్యంలోనే ఈ వ్యవహారంలో సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. మే 11న అనుకూలంగా తీర్పు ఇచ్చింది. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు చెల్లుబాటు కాకుండా మే 19న కేంద్రప్రభుత్వం ఆర్డినెన్స్ తెచ్చింది. ఇటీవల ముగిసిన వర్షాకాల సమావేశాల్లో ఆర్డినెన్స్ స్థానంలో బిల్లు ప్రవేశపెట్టగా.. ఉభయసభలు ఆమోదించాయి. ఇప్పుడు తాజాగా రాష్ట్రపతి ముర్ము ఆమోదం పొందడంతో బిల్లు చట్టరూపం దాల్చింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







