తిరుమల నడకదారిలో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తాం: టీటీడీ ఈవో
- August 12, 2023
తిరుమల: టీటీడీ ఈవో ధర్మారెడ్డి తిరుమల నడకదారిలో చిన్నారిపై చిరుత దాడి చాలా బాధాకరమని అన్నారు. నడక మార్గంలో 500 సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామన్నారు. ఘటనపై సిసిఎఫ్ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో సీన్ రీకాన్స్ట్రక్షన్ చేయించామని.. చిరుతను బంధించడం కోసం బోన్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. గతంలో బోన్ ఏర్పాటు చేసి చిరుతను బంధించామన్నారు. నడక దారిలో ఫారెస్ట్, పోలీస్, టీటీడీ కలిసి పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తామన్నారు.
ఘాట్ రోడ్డులో సాయంత్రం 6:00 నుండి ఉదయం 6 గంటల వరకు ద్విచక్ర వాహనాల రాకపోకలను నిలిపివేస్తామన్నారు. నడకదారులలో రెండు గంటల వరకే భక్తులను అనుమతించే అంశాలపై పరిశీలించి నిర్ణయం తీసుకుంటామన్నారు. నడక మార్గంలో ప్రతి 45 అడుగులకు సెక్యూరిటీ ఉండేలా చర్యలు చేపడతామన్నారు.
తాజా వార్తలు
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!







