521 మనీ-లాండరింగ్ కేసుల్లో 387 మంది అరెస్ట్

- August 15, 2023 , by Maagulf
521 మనీ-లాండరింగ్ కేసుల్లో 387 మంది అరెస్ట్

యూఏఈ: గత రెండు సంవత్సరాలలో 521 మనీలాండరింగ్ కేసులను సమర్థవంతంగా పరిష్కరించినట్లు యూఏఈ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈకేసులో ప్రపంచవ్యాప్తంగా 387 మంది వ్యక్తులను పట్టుకోవడానికి అంతర్జాతీయ చట్టాల అమలు సంస్థలతో కలిసి పనిచేసినట్టు పేర్కొంది. ఆయా కేసుల్లో Dhs4 బిలియన్లను మించి ఆస్తులను, బ్యాంకు డిపాజిట్లు, అకౌంట్లను ప్రీజ్ చేసినట్లు ఉప ప్రధాన మంత్రి మరియు అంతర్గత వ్యవహారాల మంత్రి లెఫ్టినెంట్ జనరల్ షేక్ సైఫ్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ వెల్లడించారు. మనీలాండరింగ్‌కు వ్యతిరేకంగా జాతీయ వ్యూహాన్ని పర్యవేక్షించడానికి విదేశీ వ్యవహారాల మంత్రి షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ నేతృత్వంలోని మనీలాండరింగ్ నిరోధక చర్యలు ఫలితాలు ఇస్తున్నాయని తెలిపారు. అదే సమయంలో ఉగ్రవాదానికి ఆర్థిక సహాయం చేయడంపై జాతీయ వ్యూహాన్ని పర్యవేక్షించే ఉన్నత కమిటీ చేపట్టిన తీవ్రమైన చర్యలను చేపట్టినట్లు షేక్ సైఫ్ తెలిపారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com