భారతీయులకు హిందీలో శుభాకాంక్షలు తెలిపిన షేక్ మహ్మద్
- August 15, 2023
దుబాయ్: ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులు దేశ 77వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. యూఏఈ వైస్ ప్రెసిడెంట్, ప్రధాన మంత్రి, దుబాయ్ పాలకుడు హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ఈ సందర్భంగా భారత ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ హిందీలో ట్వీట్ చేశారు. “భారతదేశం తన 77వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భంగా.. భారత నాయకత్వానికి మరియు ప్రజలకు నా అభినందనలు తెలియజేస్తున్నాను. భారత్ లో తమ భాగస్వామ్యం కొనసాగుతుంది. తమ మధ్య ఉన్న భాగస్వామ్యాన్ని కొత్త శిఖరాలకు పెంచడానికి మరియు రాజకీయ, ఆర్థిక మరియు సాంస్కృతిక సంబంధాల పెంపునకు తాము నిబద్ధతో కృషి చేస్తున్నాం. స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు .’’ అని షేక్ మహ్మద్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ X (గతంలో ట్విట్టర్)లో పోస్ట్ చేశారు.
आज जब भारत अपना 77वा स्वतंत्रता दिवस मना रहा है, मैं इस महान राष्ट्र का नेतृत्व करने वालों और इसके लोगों को बधाई देता हूँ। इस खुशी के अवसर पर, संयुक्त अरब अमीरात (UAE) भारत के साथ अपनी साझा समृद्धि और विकासशील भविष्य के निर्माण की प्रतिबद्धता की पुष्टि करता है, अपनी इस साझेदारी…
— HH Sheikh Mohammed (@HHShkMohd) August 15, 2023
ఇదిలా ఉండగా.. దుబాయ్‌లో ఈరోజు ఉదయం 6.30 గంటల నుండే భారతీయ కాన్సులేట్ వెలుపల సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. దుబాయ్ మరియు నార్తర్న్ ఎమిరేట్స్‌కు భారత తాత్కాలిక కాన్సుల్ జనరల్ రామ్‌కుమార్ తంగరాజ్ జెండా ఎగురవేశారు. అనంతరం స్వాతంత్ర సమరయోధులకు నివాళులు అర్పించారు.
ఇండియన్ సోషల్ క్లబ్ ఫుజైరాలో కాన్సులర్ సర్వీసెస్ వైస్ కాన్సుల్ అమ్రేష్ కుమార్ జెండాను ఎగురవేశారు. రస్ అల్ ఖైమాలోని ఇండియన్ రిలీఫ్ కమిటీలో పాస్‌పోర్ట్ కాన్సుల్ సునీల్ కుమార్ జెండాను ఎగురవేశారు. ఇండియన్ అసోసియేషన్ ఉమ్ అల్ క్వైన్‌లో వైస్ కాన్సల్ అకౌంట్ మరియు అడ్మిన్ మంజు అహుజా జెండాను ఎగురవేశారు.
భారత ప్రధాని నరేంద్ర మోడీ ఎర్రకోటపై జెండా ఎగురవేసిన అనంతరం జాతినుద్దేశించిన ప్రసంగించారు. ఈ సందర్భంగా మణిపూర్‌లో హింస, భారతదేశ స్వాతంత్ర్య పోరాట చరిత్ర, ప్రపంచ దేశాలతో భాగస్వామ్యం సహా అనేక అంశాలపై ప్రసంగించారు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్‌లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్‌లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







