ప్రవాసుల 913 డ్రైవింగ్ లైసెన్స్‌లు సస్పెండ్
- August 15, 2023
కువైట్: ట్రాఫిక్ విభాగం 2023 రెండవ త్రైమాసికంలో నిబంధనలు ఉల్లంఘించిన ప్రవాసుల 913 డ్రైవింగ్ లైసెన్స్‌లను సస్పెండ్ చేసింది. లైసెన్స్‌లు మూడు నెలల నుండి ఒక సంవత్సరం వరకు సస్పెండ్ చేయబడ్డాయని, కొందరివి శాశ్వత రద్దు చేయబడ్డాయన అధికారులు వెల్లడించారు.
డ్రైవింగ్ సమయంలో సెల్ ఫోన్ ఉపయోగించడం 2 పెనాల్టీ పాయింట్‌లతో పాటు రెడ్ లైట్ సిగ్నల్ జంప్ లేదా వేగంగా నడపడం వల్ల 4 పాయింట్లతో తీవ్రమైన ఉల్లంఘన అని అధికారులు తెలిపారు. 14 పెనాల్టీ పాయింట్లు ఉన్నవారికి మొదటి సస్పెన్షన్, 3 నెలల పాటు లైసెన్స్ సస్పెండ్ అవుతుంది. డ్రైవర్ అదనపు ఉల్లంఘనలకు పాల్పడి, 12 పాయింట్లు పొందితే.. లైసెన్స్ 6 నెలల పాటు సస్పెండ్ అవుతుంది. 10 అదనపు పాయింట్ల తర్వాత, లైసెన్స్ 9 నెలల పాటు రద్దు అవుతుంది. 8 అదనపు పాయింట్లు నమోదు అయితే లైసెన్స్ ఒక సంవత్సరం పాటు సస్పెండ్ కు గురవుతుంది. ఆపై మరో 6 పెనాల్టీ పాయింట్ల పొందితే లైసెన్స్ శాశ్వతంగా రద్దు చేయబడుతుందని ట్రాఫిక్ అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్‌లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్‌లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







