కాకా మాంటిస్సోరి స్కూల్ ను ప్రారంభించిన డాక్టర్ జి.వివేకానంద్
- August 15, 2023
హైదరాబాద్: 77వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ రోజు విశాఖ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చైర్మన్ డాక్టర్ జి. వివేకానంద్ అధికారికంగా కాకా మాంటిస్సోరి స్కూల్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో విశాఖ ఇండస్ట్రీస్ మేనేజింగ్ డైరెక్టర్ జి. సరోజా వివేకానంద్, విశాఖ ఇండస్ట్రీస్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ వంశీకృష్ణ గడ్డం, కాకా మాంటిస్సోరి స్కూల్ వ్యవస్థాపకురాలు రోష్ణి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను ఎగురవేసి, కాకా విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
17 సంవత్సరాల అనుభవం కలిగి, మాంటిస్సోరి-శిక్షణ పొందిన ఉపాధ్యాయుల బృందం, సహాయక సిబ్బందిని కలిగిన కాకా మాంటిస్సోరి పిల్లల సామర్థ్యాన్ని పూర్తి స్థాయిలో పెంపొందిస్తుంది. హైదరాబాద్‌లోని బాగ్ లింగంపల్లిలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇన్స్టిట్యూట్లో ఉన్న కాకా మాంటిస్సోరి స్కూల్లో 2.5 - 6 సంవత్సరాల మధ్య వయస్సు గల పిల్లలు చేరవచ్చు.
ఈ సందర్భంగా డా.జి వివేకానంద్ మాట్లాడుతూ, “కాకా మాంటిస్సోరి స్కూల్లో, మేము విద్యకు మించిన ఎదుగుదల, ఆవిష్కరణలకు ప్రాధాన్యతనిస్తాము. అంకితభావం కలిగిన అనుభవజ్ఞులైన ఉపాధ్యాయుల బృందం పిల్లల పూర్తి సామర్థ్యాన్ని వెలికితీసేందుకు కృషి చేస్తుంది. విభిన్న కార్యకలాపాల ద్వారా, మేము విలువ-ఆధారిత విద్య, నాయకత్వ లక్షణాలను ప్రోత్సహిస్తాము. ఈ పాఠశాల మా తండ్రి, 'కాకా' అని ముద్దుగా పిలుచుకునే స్వర్గీయ జి. వెంకటస్వామి జ్ఞాపకానికి నివాళి. నిస్వార్థతను మూర్తీభవిస్తూ ఆయన అణగారిన వర్గాల అభ్యున్నతికి తన జీవితాన్ని అంకితం చేసారు.’’ అన్నారు.
కాకా యొక్క మాంటిస్సోరి తన అసాధారణమైన, ప్రణాళికాబద్ధమైన సౌకర్యాలతో ప్రత్యేకంగా నిలుస్తుంది. తరగతి గది ఏర్పాట్లు స్వీయ-నిర్దేశిత అభ్యాసాన్ని ప్రేరేపించేలా ఆలోచనాత్మకంగా రూపొందించబడ్డాయి, విశాలమైన ఆట స్థలం శారీరక ఎదుగుదలకు అవకాశాలను అందిస్తుంది. కాకా మాంటిస్సోరి పాఠశాలలో, విద్యార్థుల భద్రత, సంక్షేమాలకు ప్రాధాన్యతనిస్తారు. కాకా మాంటిస్సోరి స్కూల్ లో విద్య, విద్యార్థుల సంపూర్ణాభివృద్ధి ఏకం అవుతాయి. ఈ స్కూల్ విద్యార్థులు విద్యాపరంగా, వ్యక్తిగతంగా అభివృద్ధి చెందే వాతావరణాన్ని అందిస్తుంది.
అనంతరం జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి. ఇదే వేదికపై డాక్టర్ జి. వివేకానంద్ అంబేద్కర్ లా కాలేజీలో అక్టోబర్‌లో జరిగే అంతర్జాతీయ న్యాయ సెమినార్ పోస్టర్‌ను కూడా ఆవిష్కరించారు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్‌లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్‌లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







