నజ్రాన్‌లో భవనం కుప్పకూలి ఇద్దరు కార్మికులు మృతి
- August 16, 2023
రియాద్: దక్షిణ నజ్రాన్ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న భవనం కూలిపోవడంతో ఇద్దరు కార్మికులు మరణించారు. మరో ఇద్దరు కార్మికులు గాయపడగా.. వారిలో ఒకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ భవనం హబునా గవర్నరేట్ మునిసిపాలిటీకి చెందినది. నిర్మాణంలో ఉన్న భవనం పైకప్పు కూలిపోవడంపై విచారణ జరిపి నివేదికను తనకు సమర్పించేందుకు నజ్రాన్ ప్రాంతానికి చెందిన అమీర్ ప్రిన్స్ జిలువి బిన్ అబ్దుల్ అజీజ్ బిన్ ముసేద్ ఒక కమిటీని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రిన్స్ జిలువి మరణించిన వారి కుటుంబాలకు సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మరోవైపు క్షతగాత్రులను అవసరమైన వైద్య సంరక్షణ మరియు చికిత్స కోసం హబునా జనరల్ ఆసుపత్రికి తరలించినట్లు సివిల్ డిఫెన్స్ జనరల్ డైరెక్టరేట్ పేర్కొంది.
తాజా వార్తలు
- క్రాస్ బార్డర్ స్మగ్లింప్ పై స్పెషల్ ఫోకస్..సౌదీ అరేబియా
- ఒమన్ ఆదాయాలను పెంచుతున్న పర్యాటక రంగం..!!
- యూఏఈ లాటరీ: 7 మంది అదృష్టవంతులు..ఒక్కొక్కరికి Dh100,000..!!
- ECB వడ్డీ రేట్లను తగ్గించడంపై ఆశలు పెట్టుకున్న QNB..!!
- దుబాయ్ విమానాశ్రయంలో ఇన్ఫ్లుయెన్సర్ అబ్దు రోజిక్ అరెస్టు..!!
- సముద్ర పర్యావరణానికి నష్టం.. నలుగురి అరెస్టు..!!
- ప్రముఖ నటుడు కోట శ్రీనివాస రావు కన్ను మూత
- చిన్నారి హత్య కేసు: ఇరాన్లో ప్రజల ముందే ఉరిశిక్ష
- టీయూఐ విమానంలో వాష్ రూంలో దమ్ముకొట్టిన జంట…
- ఒమన్ నుంచి ఫుజైరాకు ఎమిరాటీలు ఎయిల్ లిఫ్ట్..!!