స్టేడియంలోకి దూసుకొచ్చిన అభిమానులు. ముగ్గురు అరెస్ట్
- August 20, 2023
సౌదీ: ఫుట్‌బాల్ మ్యాచ్ సందర్భంగా పిచ్‌పైకి వచ్చి హల్చల్ చేసిన ముగ్గురు వ్యక్తులను రియాద్ పోలీసులు అరెస్టు చేశారు. క్రీడా మంత్రిత్వ శాఖ సమన్వయంతో స్టేడియంలోని పిచ్‌లోకి ప్రవేశించిన ముగ్గరిని అరెస్టు చేసినట్లు రియాద్ పోలీసు అధికారిక ప్రతినిధి తెలిపారు. ముగ్గురు వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోబడ్డాయని, ఆపై వారిని పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కు రిఫర్ చేసినట్లు అధికారిక ప్రతినిధి ధృవీకరించారు.
సౌదీ ప్రొఫెషనల్ లీగ్ రెండో రౌండ్ కార్యకలాపాల్లో భాగంగా శుక్రవారం జరిగిన అల్ నాసర్ మరియు అల్ తావౌన్ మ్యాచ్‌లో అలవ్వాల్ పార్క్ స్టేడియంలోని పిచ్‌పైకి ముగ్గురు వ్యక్తులు దూసుకొచ్చి హల్చల్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలైంది. ఈ సంఘటన తరువాత సౌదీ అరేబియా పబ్లిక్ ప్రాసిక్యూషన్‌లోని అధికారులు మ్యాచ్‌ల సమయంలో నియమాలు, నిబంధనలకు కట్టుబడి ఉండాలని క్రీడాభిమానులకు సూచించారు.
తాజా వార్తలు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్‌లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్‌లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!
- ఫ్రీ ఫుడ్ కంటే హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్కే ప్రాధాన్యం..!!
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!







