మెడికవర్ ఉమన్ & చైల్డ్ హాస్పిటల్స్ ప్రారంభం...
- August 20, 2023
హైదరాబాద్: ఉమన్ & చైల్డ్ కోసం ప్రత్యేకంగా,అత్యాధునిక సదుపాయాలతో హైటెక్ సిటీ మెటల్ చార్మినార్ ఎదురుగా నిర్మించిన మెడికవర్ ఉమన్ & చైల్డ్ హాస్పిటల్స్ ని ప్రారంభించిన ముఖ్యఅతిధులు తెలంగాణ శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి.
ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిధులు తెలంగాణ శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ,రామలింగేశ్వర రావు- చైర్మన్ ఆంధ్రప్రదేశ్ స్కూల్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ & మానిటరింగ్ కమీషన్ మరియు మాజీ న్యాయమూర్తి -తెలంగాణ & AP హైకోర్టు,కమీషనర్ ఆఫ్ పోలీస్ సివి ఆనంద్,అనురాగ్ శర్మ, సజ్జనార్,శేరిలింగంపల్లి నియోజకవర్గం BRS కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ మరియు మెడికవర్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్, ఇండియా అనిల్ కృష్ణ పాల్గొన్నారు.
ముఖ్యఅతిధి పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ అనతికాలంలోనే ప్రజలకు అత్యాధునిక సదుపాయాలతో మరియు అనుభవజ్ఞులైన డాక్టర్స్ చేత సేవలను అందిస్తూ ప్రజల మన్నలను పొందటం హర్షించతగ్గ విషయం అన్నారు. స్థాపించిన అతి కొద్దికాలంలోనే 25 హాస్పిటల్స్ కి విస్తరించడం చాలా గర్వించ తగ్గ విషయం అన్నారు. మారుతున్న జీవనశైలి వల్ల అనేక అనారోగ్య సమస్యలని పుట్టబోయే శిశువులు, పుట్టిన శిశువులు,చిన్నపిల్లలు మరియు పెద్దవారు ఎదురుకుంటున్నారు.ఈ హాస్పిటల్ని స్త్రీలకి మరియు చిన్నపిల్లలకు అత్యాధునిక సదుపాయాలతో వైద్యం అందించాలని ఉద్దేశం తో ప్రత్యేకంగా నిర్మించడం చాల సంతోష తగ్గ విషయం అన్నారు.
రామలింగేశ్వర రావు-చైర్మన్ ఆంధ్ర ప్రదేశ్ స్కూల్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ & మానిటరింగ్ కమీషన్ మరియు మాజీ న్యాయమూర్తి -తెలంగాణ & AP హైకోర్టు మాట్లాడుతూ ఉమన్ & చైల్డ్ కోసం అత్యాధునిక సదుపాయాలతో నిర్మించడం ఎంతో గొప్ప విషయం అని అన్నారు.
అనంతరం మెడికవర్ హాస్పిటల్స్ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ అనిల్ కృష్ణ మాట్లాడుతూ 100 బెడ్స్ తో , 25 బెడ్డెడ్ లెవెల్ 4 NICU & PICU యూనిట్స్ మరియు అత్యాధునిక హై ఎండ్ పరికరాలు, ఆపరేషన్ థియేటర్స్ , 24 X 7 అనుభవజ్ఞులైన గైనకాలజి , ఒబెస్ట్ట్రిక్స్ , పిడియాట్రిక్స్ & నియోనాటాలజీ డాక్టర్స్ అందుబాటులో శిశువులకి మరియు గర్భిణీ స్త్రీలకు మరియు పిల్లలకి & స్త్రీలకు వైద్య సేవలని అందించాలి అనే లక్ష్యంతో ఈ యొక్క హాస్పిటల్ ని నిర్మించడం జరిగింది అని అన్నారు. మారుతున్న జీవనశైలి,వత్తిడి వల్ల చాలా మంది అనేక అనారోగ్య సమస్యలని ఎదురుకుంటున్నారు.ప్రతి ఒక్కరు సంవత్సరానికి ఒక్కసారి అయినా ఆరోగ్య పరీక్షలు చేపించుకోవడం ఎంతో మేలు అని అన్నారు. ఎటువంటి రోగాన్ని అయిన మొదటి దశలోనే గుర్తిస్తే దానికి సరైన సమయం లో చికిత్స తీసుకోవడం వల్ల ప్రాణనష్టం జరగకుండా ఉంటుంది అని అన్నారు. అనంతరం ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్యఅతిదులకి ధన్యవాదములు తెలిపారు.
డాక్టర్ రవీందర్ రెడ్డి పీడియాట్రిక్స్ & నియోనాటాలజీ విభాగం అధిపతి మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి అత్యాధునిక సౌకర్యాలతో హై ఎండ్ టెక్నాలజీ తో వైద్యసేవలను అందిస్తున్నాం అని అన్నారు.
ఈ కార్యక్రమంలో డాక్టర్ శరత్ రెడ్డి డైరెక్టర్ క్లినికల్ సర్వీసెస్ & సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్, డాక్టర్ కృష్ణ ప్రసాద్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హరికృష్ణ,మహేష్ ధేగ్లూర్కర్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్, డాక్టర్ రవీందర్ రెడ్డి పరిగె- HOD నియోనాటాలజీ మరియు పీడియాట్రిక్స్, డాక్టర్ లలిత - యురోగైనకాలజిస్ట్, గైనకాలజిస్ట్ & ఒబెస్ట్ట్రిక్స్ డాక్టర్ రాధికా, డాక్టర్ మీనాక్షి, డాక్టర్ వరలక్ష్మి , డాక్టర్ అనూష రెడ్డి , క్లస్టర్ హెడ్ దుర్గేష్ , సెంటర్ హెడ్ అనిల్ , DMS డాక్టర్ సంగీత గారు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ఇల్లు కొంటే మహిళల పేరుపైనే రిజిస్ట్రేషన్!
- IPL 2026: చెన్నై సూపర్ కింగ్స్ పై పంజాబ్ కింగ్స్ ఘన విజయం
- వణికిన ఉత్తర భారత్..ఢిల్లీలో భూకంపం!
- హైదరాబాద్ మెట్రో స్వాధీనం: ఏప్రిల్ 30 వరకు గడువు పొడిగింపు
- తెలుగు అసోసియేషన్ క్రికెట్ లీగ్ సీజన్–3 ఘనవిజయం
- బంగ్లాదేశ్‌లో ఇంధన ఎమర్జెన్సీ: సాయంత్రం 6 గంటలకే మాల్స్ బంద్!
- ప్రభుత్వ సేవలు ఇక మీ వాట్సాప్‌లోనే.. ‘Hi’ చెబితే చాలు!
- దుబాయ్ హిందూ దేవాలయం, గురుద్వారా మూసివేత..!!
- ఒమన్- బెలారస్ సంబంధాల పై సమీక్ష..!!
- బహ్రెయిన్ లో టూర్ గైడింగ్ బలోపేతానికి కృషి..!!









