జోరు పెంచిన నితిన్.!
- August 22, 2023
మొన్నీ మధ్యనే ‘ఎక్స్ట్రా ఆర్టినరీ మేన్’ సినిమా పోస్టర్ రిలీజ్ చేసి హీరో నితిన్ షాకిచ్చాడు. ఈ సినిమాలో డిఫరెంట్ రోల్స్‌లో నితిన్ కనిపించబోతున్నాడు. శ్రీలీల ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తున్న సంగతి తెలిసిందే.
ఇదిలా వుంటే, తాజాగా మరో కొత్త సినిమానీ సెట్స్ మీదికి తీసుకెళ్లబోతున్నాడు నితిన్. ఈ నెలాఖరుకే ఈ సినిమా పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభం కానుంది. సెప్టెంబర్ 1న రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది.
‘వకీల్ సాబ్’ సినిమాతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ని డైరెక్ట్ చేసిన వేణు శ్రీరామ్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు.
అక్క, తమ్ముడి సెంటిమెంట్ నేపథ్యంలో ఈ సినిమా కథ వుండబోతోందనీ తెలుస్తోంది. యాక్షన్ ఎపిసోడ్స్ ప్రత్యేకంగా వుండబోతున్నాయనీ సమాచారం.
‘మాచర్ల నియోజకవర్గం’ సినిమా రూపంలో నితిన్‌ని ఓ పెద్ద డిజాస్టర్ వెంటాడింది ఈ మధ్య. ఈ డిజాస్టర్ నుంచి డైవర్ట్ చేయాలంటే ఓ మంచి హిట్ పడాల్సిందే. చూడాలి మరి, బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో వస్తున్నాడు. ఏ సినిమాతో సూపర్ హిట్ కొడతాడో.
తాజా వార్తలు
- హైదరాబాద్‌లో రోడ్లకు నూతన నామకరణం
- ఆఫ్‌లైన్ UPI: నెట్ అవసరం లేని చెల్లింపులు
- జేఈఈ అడ్వాన్స్డ్ 2026 పరీక్ష తేదీ ఇదే!
- DP World to develop strategic border facilities in Afghanistan under landmark agreement
- అత్యాచార బాధితుల కోసం కొత్త యాప్
- అసలైన లెక్క మొదలుకాబోతుంది: సీఎం రేవంత్
- ప్రయాణికులకు రూ.610 కోట్లు రీఫండ్ చేసిన ఇండిగో
- వెంకప్ప భాగవతులకు ‘బెస్ట్ ఫిలాంత్రఫీ అవార్డు’
- పవన్ కళ్యాణ్ కు అరుదైన బిరుదు
- నార్కొటిక్స్ ప్రమోటింగ్ చేస్తే..భారీ జరిమానాలు, జైలుశిక్ష..!!







