అఖిల్ హీరోయిన్‌కి భలే భలే మెగా ఛాన్సులే.!
- August 22, 2023
అక్కినేని హీరో అఖిల్ నటించిన ‘ఏజెంట్’ సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైంది ముద్దుగుమ్మ సాక్షి వైద్య. ధియేటర్‌లో ఈ సినిమా డిజాస్టర్ అయిన సంగతి తెలిసిందే.
డిజాస్టర్ టాక్‌తో చాలా మంది ‘ఏజెంట్’ సినిమాని చూసేందుకు ఇష్టపడలేదు. పోనీ ఓటీటీలోనైనా చూద్దాంలే వచ్చినప్పుడు.. అనుకుంటే, కనీసం ఓటీటీలో స్ర్టీమింగ్‌కి కూడా ‘ఏజెంట్’ నోచుకోవడం లేదు.
‘ఏజెంట్’ పరిస్థితి అలా వుంటే, ఈ సినిమాలో హీరోయిన్ మాత్రం మాంచి జోరు మీదుంది. వరుస ఆఫర్లు.. అవి కూడా మెగా ఆఫర్లు కొట్టేస్తూ హుషారు చూపిస్తోంది.
ఆల్రెడీ మెగా కాంపౌండ్ హీరో వరుణ్ తేజ్‌తో ‘గాంఢీవ ధారి అర్జున’ సినిమాలో నటిస్తోంది సాక్షి వైద్య. ఈ సినిమా మరి కొద్ది రోజుల్లోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
తాజాగా పవర్ ఛాన్స్ కొట్టేసింది సాక్షి వైద్య. అదే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో ‘ఉస్తాద్ భగత్ సింగ్’లో నటించే ఛాన్స్. అవును లేటెస్ట్‌గా ఈ న్యూస్ కన్‌ఫామ్ అయ్యింది. హరీష్ శంకర్ డైరెక్షన్‌లో రూపొందుతోన్న ఈ సినిమాలో ఆల్రెడీ శ్రీలీల ఓ హీరోయిన్‌గా నటిస్తుండగా, ఇంకో హీరోయిన్‌గా సాక్షి వైద్య కన్‌ఫామ్ అయ్యింది.
తాజా వార్తలు
- ఎయిర్ ఇండియా అంతర్జాతీయ విమాన సర్వీస్ లు పునరుద్దరణ
- అంతరిక్ష యాత్రకు తెలుగమ్మాయి..
- హైదరాబాద్ పాస్‌పోర్టు కార్యాలయానికి అరుదైన పురస్కారం
- పార్టీ నేతల తీరు పై సీఎం చంద్రబాబు అసంతృప్తి
- దుబాయ్‌లో వీసా మోసం కేసు: 21 మంది దోషులు
- ఖతార్ లో విమాన రాకపోకలు ప్రారంభం
- డ్రగ్స్ కొనుగోలు చేశాను.. అమ్మలేదు: శ్రీరామ్
- TTD: తిరుమలలో శ్రీ వెంకటేశ్వర మ్యూజియం ఏర్పాటు
- ట్యాక్స్ అనేది చట్టబద్ధమైన అవసరం కాదు, వ్యూహాత్మక అత్యవసరం..!!
- కొన్ని యూఏఈ, జీసీసీ ఫ్లైట్స్ తాత్కాలికంగా నిలిపివేత..!!