చెస్ ప్రపంచకప్ ఫైనల్.. రెండో గేమ్ కూడా డ్రా నే....
- August 23, 2023
అజర్బైజాన్: ఫిడే చెస్ ప్రపంచకప్ ఫైనల్లో రెండో గ్రేమ్ సైతం డ్రాగా ముగిసింది. ఫైనల్ మ్యాచ్‌లో భారత యువ సంచలనం, గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానంద, ప్రపంచ నంబర్ వన్ ఆటగాడు మాగ్నస్ కార్ల్సన్ తో తలపడుతున్న సంగతి తెలిసిందే. మంగళవారం ఇరువురి మధ్య జరిగిన మొదటి గేమ్ డ్రాగా ముగియగా, నేడు(ఆగస్టు 23 బుధవారం) జరిగిన రెండో గేమ్ సైతం డ్రా గానే ముగిసింది. దీంతో గురువారం టై బ్రేక్ ద్వారా విజేతను నిర్ణయించనున్నారు.
మొదటి మ్యాచ్‌లో 35 ఎత్తుల తరువాత ఇద్దరు డ్రా కు అంగీకరించగా నేడు జరిగిన రెండో గేమ్‌లో 30 ఎత్తుల తరువాత డ్రా చేసుకున్నారు. ఈ మ్యాచ్‌లో కార్ల్సన్ తెల్లపావులతో, 18 ఏళ్ల ప్రజ్ఞానంద నల్లపావులతో బరిలోకి దిగారు. మ్యాచ్ అనంతరం ప్రజ్ఞానంద మాట్లాడుతూ.. ‘ఇది ఒక విధంగా సులభమైన రోజు అని అన్నాడు. ఇద్దరం డ్రాతో సంతోషంగా ఉన్నట్లు తెలిపాడు. మ్యాచ్ టై బ్రేక్‌కు దారి తీసింది. అతను చాలా త్వరగా D4ని తీసుకున్నప్పుడు ఆ సమయంలో మ్యాచ్ సులభం అని నాకు అనిపించింది.’ అని ప్రజ్ఞానంద చెప్పారు.
చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ తరువాత ప్రపంచకప్ ఫైనల్ లో అడుగుపెట్టిన రెండో భారత ఆటగాడిగా ప్రజ్ఞానంద రికార్డులకు ఎక్కాడు. సెమీస్‌లో అతడు ప్రపంచ మూడో ర్యాంకు ఆటగాడు ఫాబియానో కరువానాను ఓడించి ఫైనల్‌కు చేరుకున్నాడు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్‌లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్‌తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్‌పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!







