‘ఓజీ’, ‘ఉస్తాద్ భగత్ సింగ్’..! రెండూ సైమల్టేనియస్‌గా.!
- August 24, 2023
సుజిత్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘ఓజీ’ సినిమా ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ పూర్తయిపోయింది. చివరి షెడ్యూల్‌ని విదేశాల్లో ప్లాన్ చేశారు.
అందుకోసం పవన్ కళ్యాణ్ రాజకీయాలకు కాస్త గ్యాప్ ఇచ్చి, విదేశీ పయనం షురూ చేశారు కూడా. ఇక, ‘ఉస్తాద్ భగత్ సింగ్’ విషయానికి వస్తే, ఈ సినిమా దాదాపు ఆగిపోయిందన్న వార్తలు వినిపించాయ్.
అయితే, ఈ సినిమా కూడా ఆగిపోలేదనీ, ఎలాగైనా పూర్తి చేసేస్తామని హరీష్ శంకర్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ పొలిటికల్ షెడ్యూల్స్‌కి ఎలాంటి ఆటంకం కలగకుండా, అలాగే, ‘ఓజీ’ షూటింగ్‌తో పాటూ, ఈ సినిమా షూటింగ్ కూడా చేసేయబోతున్నారట.
‘ఓజీ’ నిర్మాతలూ, భగత్ సింగ్ నిర్మాతలూ ఒకే మాట మీద వుండి ఈ రెండు సినిమాలూ పూర్తి చేసే బాధ్యతని బాధ్యతగా తీసుకున్నారనీ తెలుస్తోంది. ‘ఓజీ’ నిమిత్తం పవన్ వెళుతున్న చోటకే, భగత్ సింగ్ టీమ్ కూడా వెళ్లనున్నారనీ తెలుస్తోంది. అక్కడే కొన్ని సీన్లూ, పాటలూ షూట్ చేసేయనున్నాడట హరీష్ శంకర్. అదీ సంగతి.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







