వర్మ ఓవరాక్షన్ ఆలా బెడిసికొట్టిందా.?
- August 24, 2023
సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మకి సంబంధించిన ఏ న్యూస్ అయినా అదో సంచలనమే. తనను తాను అలా సంచలనాత్మక డైరెక్టర్‌గా కాదు కాదు, వ్యక్తిగా మలచుకున్నారాయన. ఆయన తెరకెక్కించే సినిమాలు ఈ మధ్య రిలీజ్‌కే నోచుకోకపోతున్నప్పటికీ, రిలీజ్‌కి ముందు ఆయన చేసే హల్‌చల్, హంగామా అంతా ఇంతా కాకుండా పోతోంది.
ఆ మధ్య కొన్ని బూతు సినిమాలు తీసి రచ్చ రచ్చ చేసిన రామ్ గోపాల్ వర్మ, ‘వ్యూహం’ అనే టైటిల్‌తో ఓ సినిమా ప్రకటించిన సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాల రాజకీయాల నేపథ్యంలో ఈ సినిమా వుండబోతోందని ఫస్ట్ లుక్ పోస్టర్ ద్వారా హింట్ ఇచ్చారు.
ఆ తర్వాత కూడా కొన్ని పోస్టర్లు రిలీజ్ చేశారు. అయితే, ఆ పోస్టర్లే ఆయన కొంప ముంచేస్తున్నాయట. వైసీపీకి వ్యతిరేకంగా కన్‌వే అవుతున్నాయట. దాంతో, ఈ సినిమా వల్ల తమకేం ఒరిగేది వుండదని వైసీపీ నేతలు ఈ సినిమాని లైట్ తీసుకున్నారట.
అవును మరి, ఈ సినిమాకి స్పాన్సర్లు వాళ్లే కదా. వాళ్లు లైట్ తీసుకుంటే, వర్మగారు ఏం చేయగలరు.? అలా వర్మ ఒకటి అనుకుంటే, ఇంకోటి అయ్యింది ‘వ్యూహం’ విషయంలో. అలా వర్మ ‘వ్యూహం’ బెడిసికొట్టిందన్నమాట.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







