చిరంజీవి సపోర్ట్త్‌తో మెహర్ రమేష్ కొత్త సినిమా.?
- August 25, 2023
‘భోళా శంకర్’ సినిమాతో మెహర్ రమేష్‌కి ఓ మంచి హిట్ ఇవ్వాలని భావించారు మెగాస్టార్ చిరంజీవి. మెహర్ రమేష్ వ్యక్తిత్వం, మంచితనం తెలిసిన ఇండస్ర్టీలో చాలా మంది ఈ సినిమా ఎలాగైనా హిట్ అవ్వాలని, మెహర్ రమేష్‌కి మంచి కమ్ బ్యాక్ మూవీ అవ్వాలని ఆశించారు.
కానీ, ఎంత చేసినా టైమ్ బ్యాడ్. ఆయనకు ఎప్పటిలాగే ఫ్లాప్ వచ్చింది ‘భోళా శంకర్’తో. అయినా కానీ, చిరంజీవి మెహర్ రమేష్‌ని వదిలిపెట్టలేదట. ఓ చిన్న కాన్సెప్ట్.. చిన్న హీరో.. అంచనాల్లేకుండా ఓ సినిమా తెరకెక్కించమని సలహా ఇచ్చాడట.
ఆ క్రమంలోనే ఓ కథ సిద్ధం చేసుకున్నాడట. హీరోగా రాజ్ తరుణ్‌ని సెలెక్ట్ చేసుకున్నాడట మెహర్ రమేష్. ఒకప్పుడు మినిమమ్ గ్యారంటీ హీరోగా డబుల్ హ్యాట్రిక్ కొట్టిన యంగ్ హీరో రాజ్ తరుణ్‌కి ఇప్పుడు పెద్దగా మార్కెట్ లేదు.
చాలా కాలంగా రాజ్ తరుణ్ నుంచి సినిమాలేమీ రావడం లేదు. ఈ మధ్య ‘అహ నా పెళ్లంట’ అంటూ ఓ వెబ్ సిరీస్‌తో ఓటీటీలోనూ అడుగు పెట్టాడు కానీ, అదీ బెడిసికొట్టింది.
ఈ టైమ్‌లో రాజ్ తరుణ్‌తో ఓ సింపుల్ మూవీని తీసి వదిలితే ఎలా వుంటుంది.? అని భావిస్తున్నాడట మెహర్ రమేష్. ఒకవేళ లక్కు కలిసొచ్చి సినిమా హిట్టయితే, అటు రాజ్ తరుణ్‌కీ, ఇటు మెహర్ రమేష్‌కీ సెల్ఫ్ శాటిస్‌ఫేక్షన్ కదా.! పూర్తి వివరాలు తెలయాల్సి వుంది.
తాజా వార్తలు
- ఖతార్ లో ఉపాధ్యాయులకు సామర్థ్య పరీక్షలు..!!
- కువైట్ లో పొగమంచు, రెయిన్ అలెర్ట్ జారీ..!!
- ముగిసిన రెడ్ వేవ్ 8 నావల్ డ్రిల్..!!
- దుబాయ్ లో T100 ట్రయాథ్లాన్..ఆర్టీఏ అలెర్ట్..!!
- బహ్రెయిన్ లో దీపావళి మిలన్..!!
- STPలో నీటి నాణ్యతపై అధ్యయనం..!!
- దుస్తులలో 3 కిలోలకు పైగా నార్కోటిక్స్..!!
- సౌదీలో నవంబర్ 25 నుండి ఫ్యామిలీ బీచ్ స్పోర్ట్స్ ఫెస్టివల్..!!
- ఒక నెల స్కూళ్లకు సెలవులు..పీక్ ట్రావెల్ సీజన్..!!
- కువైట్ లో ఎయిర్ లైన్ సహా 8 ట్రావెల్ ఆఫీసులకు ఫైన్స్..!!







