అనుష్క ఊ అంటుందా.! ఊహూ అంటుందా.?

- August 25, 2023 , by Maagulf
అనుష్క ఊ అంటుందా.! ఊహూ అంటుందా.?

స్వీటీ అనుష్క కోసం చాలా ట్రై చేస్తున్నారట. అవునండీ, టాలీవుడ్‌లో హీరోయిన్ల కొరత వున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా సీనియర్ హీరోల విషయంలో ఈ కొరత సుస్పష్టంగా కనిపిస్తోంది.
త్రిష, నయనతార సీనియర్ హీరోయిన్లున్నప్పటికీ మేకర్లు ఎందుకో ఇంట్రెస్ట్ చూపించడం లేదు. ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సినిమాతో అనుష్క రీ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే.
ఈ సినిమాపై మంచి బజ్ క్రియేట్ అయ్యింది. సెప్టెంబర్ 7న రిలీజ్ అవుతోంది ఈ సినిమా. సో, ఈ సినిమా రిజల్ట్ కనుక బాగుంటే, అనుష్కకి మళ్లీ అవకాశాలు క్యూ కట్టేయడం ఖాయం. 
అయినా, అవకాశాలు అనుష్కకు కరువేంటీ.? ఫిజిక్ పాడయిపోవడంతో అనుష్కనే పర్సనల్‌గా సినిమాలకు దూరంగా వుంటోంది. ఒక్కసారి ఊ అంటే చాలు అనుష్క కోసం సీనియర్ హీరోలంతా క్యూ కట్టేస్తారు. 
మరి, అనుష్క ఊ అంటుందా.? ఊహూ అంటుందా.? తెలియాలంటే ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సినిమా రిలీజ్ వరకూ ఆగాల్సిందే.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com