బహ్రెయినీలకు ఉద్యోగాలిస్తే రివార్డులు
- May 18, 2016
బహ్రెయినీ లెజిస్లేటర్ ఒకరు, తమ కంపెనీల్లో బహ్రెయినీలకు ఉన్నత స్థానాల్లో అవకాశమిస్తే, ప్రభుత్వం రివార్డు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు. పార్లమెంట్లో జరిగిన సమావేశంలో ఎంపీ అదెల్ హమీద్, లేబర్ సోషల్ డెవలప్మెంట్ మినిస్టర్ జమీల్ హుమైదాన్తో మాట్లాడుతూ, పలు సూచనలు చేశారు. మినిస్టర్ చెప్పిన వివరాల ప్రకారం 7000 మంది బహ్రెయినీలు నిరుద్యోగులుగా ఉన్నారనీ, వీరిలో ఎక్కువగా యూనివర్సిటీ గ్రాడ్యుయేట్లు మహిళలు ఉన్నారని వెల్లడయ్యింది. ప్రైవేటు సెక్టార్లో కొందరు, బహ్రెయినీలకు చిన్న చిన్న ఉద్యోగాలతో సరిపెడుతున్నారనీ, ఉన్నత స్థానాల్లో ఉద్యోగాలు కల్పించే సంస్థలకు రివార్డు ప్రకటిస్తే అది బహ్రెయినీలకు గౌరవం దక్కేలా మిగతా సంస్థలపై ఒత్తిడి పెరుగుతుందని అదెల్ హమీద్ చెప్పారు. మినిస్టర్ హుమైదాన్, అదెల్ హమీద్ సూచననలు ఆహ్వానించారు. బహ్రెయిన్‌లో మహిళా నిరుద్యోగులు ఎక్కువగా ఉన్నారనీ, వారికి ఉద్యోగాలు కల్పించే దిశగా ఉన్న అవకాశాలన్నిటినీ పరిశీలిస్తామని మంత్రి చెప్పారు.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







