అల్లు ఆర్మీ.. మెగా ఫ్యాన్స్.! ఈ లొల్లి అంతా తూచ్.!

- August 28, 2023 , by Maagulf
అల్లు ఆర్మీ.. మెగా ఫ్యాన్స్.! ఈ లొల్లి అంతా తూచ్.!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌కి ఇటీవల జాతీయ ఉత్తమ నటుడు అవార్డు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ అవార్డు దక్కిన తర్వాత అల్లు అర్జున్‌పై అనేక రకాలుగా దుష్ప్రచారం జరుగుతోంది.

అల్లు అర్జున్ ఫ్యాన్స్.. మెగా ప్యాన్స్ అంటూ సెపరేట్ చేస్తూ సోషల్ మీడియాలో అనవసరమైన లొల్లి జరుగుతోంది. అయితే, ‘కట్టె కాలేవరకూ తాను చిరంజీవి అభిమానినే..’ అంటూ అల్లు అర్జున్ పలుమార్లు చెప్పిన సంగతి తెలిసిందే.

అవును చిరంజీవి అంటే అల్లు అర్జున్‌కి అంతే అభిమానం. అన్నింటికీ మించి స్వయానా తన మేనత్తకు భర్త చిరంజీవి. అలాంటప్పుడు వీరి మధ్య గొడవలు ఎందుకుంటాయ్.?

ఇక, తాజాగా జాతీయ పురస్కారం అందుకున్నందుకుగాను అల్లు అర్జున్‌ని ప్రత్యేకంగా ఇంటికి పిలిచి ఆశీర్వదించారు సతీ సమేతంగా మెగాస్టార్ చిరంజీవి.

దీనికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతోంది. అల్లు అర్జున్‌కి ప్రేమగా స్వీట్ తినిపిస్తున్న ఈ ఫోటోతో అల్లు ఫ్యామిలీకీ, చిరంజీవి ఫ్యామిలీకి మధ్య ఏదో వుందంటూ జరుగుతున్న ప్రచారానికి చెక్ పెట్టినట్లయ్యిందనే చెప్పొచ్చు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com