హోమ్ మెడిసెన్‌గా లవంగాలు.! ఇన్ని ఉపయోగాలా.?
- August 28, 2023
లవంగాలతో దాదాపు చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఎన్నింటినో దూరం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. మసాలా కూరల్లో లవంగాలను ఎక్కువగా వాడుతుంటాం. కానీ, రెగ్యులర్‌గా లవంగాలను ఆహారంలో వుపయోగించే వారికి చాలా రకాల అనారోగ్య సమస్యలు దూరమవుతాయని అంటున్నారు.
లవంగాల్లో వుండే పోషకాలు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీస్ కణాల నష్టాన్ని తగ్గిస్తాయ్. ఇందులో సి విటమిన్ ఎక్కువగా వుంటుంది. లవంగాల్లోని ఫ్లేవనాయిడ్స్, ఫినాలిక్ సమ్మేళనాలు పుష్కలంగా వుండడంతో రోగ నిరోధక శక్తి వృద్ధి చెందుతుంది.
కణాల వాపు, ఆర్ధరైటిస్ వంటి వాటిని నయం చేయడానికి లవంగాలు తోడ్పడతాయ్. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఆర్ధరైటిస్‌ని నియంత్రించడానికి లవంగాలు తోడ్పడతాయ్.
అలాగే, పంటి నొప్పికి లవంగాలు చక్కని పరిష్కారం. దీంట్లో వుండే యూసిన్ అనే సమ్మేళనం సహజ నొప్పి నివారిణిగా పని చేస్తుంది.
లవంగాల్లో వుండే యాంటీ మైక్రో బయాల్ గుణాలు జీర్ణాశయంలో అవాంఛిత బ్యాక్టీరియాను తగ్గిస్తాయ్. గ్యాస్, ఉబ్బరం వంటి సమస్యల్ని కూడా నియంత్రిస్తాయ్.
తాజా వార్తలు
- ఓటర్లకు ముఖ్య గమనిక..
- ఉత్తరకాశీ టన్నెల్ ఆపరేషన్ సక్సెస్..
- తెలంగాణ ప్రజలకు సోనియాగాంధీ కీలక సందేశం
- దుబాయ్ లో శ్రీలంక ఫుడ్ ఫెస్టివల్
- బీమా క్లెయిమ్ కావాలంటే.. కారు ఓనర్లు ఈ తప్పులు చేయకండి
- ఇతరులపై దాడి చేస్తే.. ఏడాది జైలుశిక్ష, 10,000 దిర్హామ్ల జరిమానా
- సౌదీ పర్యాటక ప్రమోషన్.. 277% పెరిగిన బుకింగ్లు
- బీచ్లో బార్బెక్యూలు.. అధికారుల హెచ్చరిక
- నవంబర్ 30న పోలింగ్ రోజు అన్ని ప్రైవేట్ సంస్థలు సెలవు ప్రకటించాలి: ఎలక్షన్ కమిషన్
- అల్ దఖిలియాలో ఘోర అగ్ని ప్రమాదం..ఒకరు మృతి